సైఫ్‌పై దాడి: 'ఎనకౌంటర్ స్పెషలిస్ట్' దయానాయక్ ఎంట్రీ..!

First Published | Jan 16, 2025, 2:32 PM IST

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. దర్యాప్తులో భాగంగా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ సైఫ్ ఇంటికి వచ్చారు.

Saif Ali Khan, Encounter Specialist, Daya Nayak



ఎన్టీఆర్ దేవర నటుడు  బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan)పై కత్తితో దాడి చేసిన వ్యక్తి ఎవరనేది ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి నిందితుడి కోసం గాలింపుచర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనను అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నారు. అలీఖాన్‌ సొసైటీలోని సిబ్బందిలోనే దుండగుడు ఉండొచ్చని బలంగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే సైఫ్‌కు చెందిన ఐదుగురు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఆ సొసైటీ గార్డ్‌ కూడా ఎవరినీ చూడలేదని చెబుతున్నారు. దొంగతనం కోసమే ఈ దాడి జరిగిందా అన్న ప్రశ్నకు పోలీసులు స్పందిస్తూ.. దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. 
 

ఈ నేపధ్యంలో ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ సైఫ్ బంగ్లాకు వచ్చారు. ఆయన తనదైన శైలిలో ఇన్విస్టిగేట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఆయన సీన్ లోకి రాగానే మీడియా ఎటెక్షన్ ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. దయానాయక్ ముంబై సర్కిల్స్ లో కేసులు ఇన్విస్టిగేట్ చేయటంలో పెద్ద  పేరు ఉన్న సంగతి తెలిసిందే. 
 


దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ ఇంటి సీసీ టీవీ దృశ్యాలు తనిఖీ చేశారు. సైఫ్‌పై దుండగుడు తెల్లవారుజామున 2.30 సమయంలో కత్తితో దాడి చేశాడు. అంతకుముందు రెండు గంటల లోపల ఎవరూ ఆ సొసైటీలోకి వెళ్లలేదని పోలీసులు గుర్తించారు. 
 

నటుడు ఉంటున్న సొసైటీలో ఆ దుండగుడు ముందే ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ దాడిలో సైఫ్‌ ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. 

సైఫ్‌పై దాడి జరిగినట్లు తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సీనియర్‌ అధికారుల బృందం అక్కడికి చేరుకొంది. గాయపడిన నటుడిని లీలావతి ఆస్పత్రికి తరలించినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు ఆంగ్ల పత్రికకు వెల్లడించారు.

దుండగుడు సైఫ్‌ అలీఖాన్‌ కుమారుడు జేహ్‌ గదిలో నక్కినట్లు స్థానిక పత్రిక లోక్‌మత్‌ కథనంలో పేర్కొంది. దీంతో జేహ్‌ కేర్‌టేకర్‌ అతడిని చూసి కేకలు వేసినట్లు పేర్కొంది. దీంతో హడావుడిగా సైఫ్‌ అక్కడికి చేరుకొనగా.. పెనుగులాట జరిగింది. ఈక్రమంలో సైఫ్‌ గాయపడ్డారు.

దాడి జరిగిన సమయంలో కరీనా, తైమూర్‌ కూడా ఇంట్లోనే ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు ధ్రువీకరించారు. ఆరుచోట్ల కత్తి గాయాలు కాగా.. వీటిలో వెన్నెముక పక్కన, మరొక చోట లోతైన గాయాలు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. 

Latest Videos

click me!