రజినీకాంత్ తో ఓ సినిమా విషయంలో పట్టు పట్టి.. ఇళయరాజా శపథం చేశారు. అసవరమైతే సినిమాలు మానేస్తానన్నారు. దీంతో షాకైన రజినీ, సినిమాను ఎలాగైనా ఆడించాలని ప్లాన్ చేశారు. కానీ, ఆ సినిమా దానంతట అదే భారీ విజయం సాధించింది. ఇంతకీ విషయం ఏంటంటే?
సినిమా ప్రపంచంలో సూపర్‌స్టార్ రజినీకాంత్, ఇళయరాజా కలిస్తే అదో మ్యాజిక్. కానీ, వాళ్ల కాంబోలో వచ్చిన ఓ మెగా హిట్ సినిమా వెనుక, రజినీకాంత్‌నే షాక్‌కు గురిచేసిన ఓ సంచలన సంఘటన జరిగింది. ఆ విషయం చాలా మందికి తెలియదు.
27
1989 లో జరిగిన సంఘటన..
అది 1989వ సంవత్సరం. 'రాజాధి రాజా' సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. కానీ హీరో రజినీకాంత్‌కు మాత్రం లోపల ఏదో తెలియని టెన్షన్. దానికి చాలా కారణాలున్నాయి. డైరెక్టర్ ఆర్. సుందర్‌రాజన్ చేతిలో సీన్ పేపర్ లేకుండానే స్పాట్‌కు వచ్చేవారు. నిర్మాత భాస్కర్ సినిమా గురించి కాకుండా ఏదేదో మాట్లాడేవారు. ఇక సినిమాకు కీలకమైన పంజు అరుణాచలం అసలు ఊళ్లోనే లేరు. 'సినిమా సరిగ్గా వస్తుందా? నా కెరీర్ ఏమవుతుంది?' అని రజినీ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు.
37
ఇళయరాజాతో రజినీకాంత్ ఏమన్నారంటే?
రజినీ తన ఆందోళనను ఇళయరాజాతో పంచుకున్నారు. అక్కడే ఆ సంచలన సంఘటన జరిగింది. రజినీ బాధను విన్న ఇళయరాజా, ఒక్కసారిగా ఓ సంచలన నిర్ణయం ప్రకటించారు. “రజినీ... ఈ సినిమా కథ నాకు తెలీదు, ఒక్క లైన్ కూడా నేను చదవలేదు. కానీ ఒక్క మాట చెప్తున్నా... ఈ సినిమా సిల్వర్ జూబ్లీ ఆడకపోతే, నేను మళ్లీ నా హార్మోనియం ముట్టుకోను! పాటలు కూడా పాడను!” అని శపథం చేశారు.
ఇళయరాజా చేసిన ఈ 'డూ ఆర్ డై' శపథం విని రజినీకాంత్ నిర్ఘాంతపోయారు. ఒకవేళ సినిమా ఆడకపోతే, తన వల్ల ఓ గొప్ప కళాకారుడి సంగీత ప్రస్థానం ముగిసిపోతుందేమోనని ఆయన భయపడిపోయారు.
57
రహస్యంగా ప్లాన్ చేశారు..
ఇళయరాజా చెప్పారంటే అది చేసి తీరుతారని రజినీకి తెలుసు. ఆ టెన్షన్‌తో ఆయన ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తనకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి, 'ఒకవేళ సినిమా సరిగ్గా ఆడకపోయినా, డబ్బులు నేను ఇస్తాను... ఎలాగైనా సినిమాను ఆడించి సిల్వర్ జూబ్లీ అయ్యేలా చూడండి' అని రహస్యంగా ప్లాన్ చేశారు. ఇళయరాజా శపథం రజినీని ఆ రేంజ్‌లో వెంటాడింది.
67
థియేటర్లు దద్దరిల్లిపోయాయి...
రజినీకాంత్ భయపడినట్లు ఎలాంటి 'మ్యానేజ్' చేయాల్సిన అవసరం రాలేదు. సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇళయరాజా సంగీతం, రజినీ స్టైల్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.
77
రజినీకాంత్ షాక్ అయ్యారు..
ఇళయరాజా ఏది చెప్పారో, అక్షరాలా అదే జరిగింది! 'రాజాధి రాజా' థియేటర్లలో 175 రోజులు పూర్తిచేసుకుని సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. 'ఆయన ఊరికే అనలేదు, ఏదో ఒక శక్తి ఆయనతో ఆ మాట అనిపించింది' అని రజినీకాంత్ ఇప్పటికీ ఆశ్చర్యంగా చెబుతుంటారు.