The Raja Saab Review: ది రాజా సాబ్‌ ఫస్ట్ రివ్యూ.. ప్రభాస్‌ మూవీలో హైలైట్స్ ఇవే, వెయ్యి కోట్లు పక్కా

Published : Jan 06, 2026, 10:56 AM ISTUpdated : Jan 06, 2026, 03:31 PM IST

ప్రభాస్‌ హీరోగా రూపొందిన బిగ్గెస్ట్ హర్రర్‌ కామెడీ మూవీ `ది రాజాసాబ్‌` ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ వచ్చింది. 

PREV
15
ప్రభాస్‌ నటించి తొలి హర్రర్‌ కామెడీ చిత్రం `ది రాజా సాబ్‌`

ప్రభాస్‌ ఏడాది గ్యాప్‌ తర్వాత వస్తోన్న మూవీ `ది రాజా సాబ్‌`. మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదల కాబోతుంది. భారీ బడ్జెట్‌తో ఫాంటసీ హర్రర్‌ కామెడీగా దీన్ని రూపొందించారు దర్శకుడు మారుతి. ప్రభాస్‌ నటించిన తొలి హర్రర్‌ కామెడీ చిత్రమిది. 

25
`ది రాజా సాబ్‌` ఫస్ట్ రివ్యూ

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చింది. దీనికి పాజిటివ్‌ టాక్ రావడం విశేషం. ప్రముఖ ఓవర్సీస్‌ క్రిటిక్‌ గా భావించే ఉమైర్‌ సందు తన ఫస్ట్ రివ్యూని ఇచ్చారు. ఇది పైసా వసూల్‌ మూవీ అని ప్రకటించారు. పైసా వసూల్‌ మాస్‌ ఎంటర్టైనర్‌ మూవీ అని చెప్పారు.

35
ది రాజాసాబ్‌లో హైలైట్స్

ప్రభాస్‌ భారీ బ్యాంగ్‌తో బ్యాక్‌ అవుతున్నారని, అతను తన నటనతో, తన ప్రజెన్స్ తో అందరిని ఆకట్టుకుంటారని, ఆయన పాత్రనే సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్‌ అని చెప్పారు. అతని నటన చాలా క్రేజీగా ఉందని, గతంలో ఎప్పుడూ ఇలా చూసి ఉండరని చెప్పాడు. సంజయ్‌ దత్‌ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ప్రభాస్‌, సంజయ్‌ దత్‌కి సంబంధించిన సీన్లు అదిరిపోయేలా ఉంటాయని, క్లాప్స్ కొట్టేలా ఉంటాయని చెప్పారు. చివరి 30 నిమిషాలు, క్లైమాక్స్ సినిమాకి పెద్ద అసెట్‌` అన్నారు.

45
పక్కా సంక్రాంతి ఫెస్టివల్‌ మూవీ

సినిమాలో కొన్ని బోరింగ్‌ మూమెంట్స్ ఉంటాయని, కానీ ఓవరాల్‌గా చూస్తే సంక్రాంతికి ఫెస్టివల్‌ వైబ్‌ని తీసుకొచ్చే మూవీ అవుతుందన్నారు. నిధి అగర్వాల్‌ చాలా క్యూట్‌గా ఉంటుందని, పాటలు అలరించేలా ఉంటాయన్నారు. దర్శకత్వం, వీఎఫ్‌ఎక్స్ వేరే లెవల్‌ అని తెలిపారు. హర్రర్‌ రైడ్‌ని ఎంజాయ్‌ చేసేలా ఉంటుందని చెప్పారు. ఉమైర్‌ సందు రివ్యూలను చాలా వరకు నమ్మరు. అందులో ఎంత వరకు నిజం అనేది తెలియదు. ఆయన ఇచ్చిన చాలా రివ్యూలు తలక్రిందులయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు `ది రాజాసాబ్‌` విషయంలోనూ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ఉమైర్‌ సందు రివ్యూని  పూర్తిగా నమ్మడానికి లేదు. 

55
ది రాజా సాబ్‌ సెన్సార్‌ రిపోర్ట్

`ది రాజాసాబ్‌`  సినిమా గురించి దర్శకుడు మారుతి చెబుతూ, సినిమాలో 20 శాతం ఫాంటసీ ఉంటుందని, 20 శాతం ఎమోషన్స్ ఉంటాయని, 50 శాతం కామెడీ ఉంటుందని చెప్పారు. మొత్తంగా మంచి హర్రర్‌ కామెడీ మూవీని రూపొందించారని అర్థమవుతుంది. ప్రభాస్‌ రేంజ్‌కి ఈ మూవీ వర్కౌట్‌ అయితే బాక్సాఫీసు షేక్‌ కావడం పక్కా. వెయ్యి కోట్లు ఈజీగా వస్తాయని అంటున్నారు. మరి ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories