Ennenno Janmala Bandham: యష్ ను అనుమానించిన వేద.. అమ్మ కావాలి అంటూ మారం చేస్తున్న ఖుషి!

Published : Mar 21, 2022, 01:10 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కథతో ఈ సీరియల్ ప్రసారం అవుతూ మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Ennenno Janmala Bandham: యష్ ను అనుమానించిన వేద.. అమ్మ కావాలి అంటూ మారం చేస్తున్న ఖుషి!
Ennenno Janmala Bandham

వేద (Vedha), యష్ (Yash) కుటుంబ సభ్యులు తమ ఫస్ట్ నైట్ కోసం హోటల్లో ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సాంబార్ ఎఫెక్ట్ వల్ల యష్ పదే పదే వాష్ రూమ్ కి వెళ్తూ ఉంటాడు. ఇక హోటల్ కు వేద కూడా వచ్చి హనీమూన్ అని తెలుసుకొని కంగారు పడుతూ ఉంటుంది.
 

26
Ennenno Janmala Bandham

ఎలాగైనా ఫస్ట్ నైట్ ను కాకుండా చూసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇక రూమ్ లోకి వెళ్ళేసరికి అన్ని అరేంజ్మెంట్స్ చూసి తెగ కంగారు పడుతుంది. వెనుకకు వెళ్లాలని అనుకోగా ఖుషి (Khushi) గుర్తుకు వచ్చి ఆగిపోతుంది. ఆ తర్వాత  రూమ్ బాయ్ వచ్చి ప్రికాషన్స్ ఇవ్వటంతో అది చూసిన వేద (Vedha) షాక్ అవుతుంది.
 

36
Ennenno Janmala Bandham

ఇక యష్ (Yash) ను తప్పు పడుతుంది. మగ బుద్ధి ఇంతె అంటూ తెగ తిట్టి పోసుకుంటుంది. మరోవైపు మాలిని ఇక యష్, వేద లకు అడ్డు ఏమీ లేదు అని అనుకునేసరికి అప్పుడే ఖుషి వచ్చి అమ్మ నాన్న ఎక్కడ అని అడుగుతుంది. దాంతో మాలిని (Maalini) చెప్పడానికి ఇబ్బంది పడటం తో రత్నంను చెప్పమంటుంది.
 

46
Ennenno Janmala Bandham

ఇక రత్నం (Ratnam) కూడా చెప్పాలని ప్రయత్నించి చెప్పలేకపోతాడు. నాకు అమ్మ కావాలి అని ఏడవడం మొదలు పెడుతుంది ఖుషి. మాలిని సులోచనను పిలవడంతో.. సులోచన వెటకారంగా పలుకుతూ.. ఏం కావాలి అని ఖుషిని (Khushi) ప్రేమతో అడుగుతుంది. ఖుషి తనకు అమ్మ కావాలి అనడంతో సులోచన కూడా ఏం చేయలేక పోతుంది.
 

56
Ennenno Janmala Bandham

ఇక రూమ్ లో వాటిని పట్టుకునందుకు చేతులు కడుక్కోవాలి అని తెగ కంగారు పడుతూ ఉంటుంది. అంతలోనే యష్ (Yash) డ్రెస్ మార్చుకొని రావటంతో యష్ దాని కోసమే ఎదురు చూస్తున్నట్టుగా తప్పు పడుతుంది. రూమ్ బాయ్ తీసుకు వచ్చిన వాటి గురించి అడగటంతో యష్ తన కడుపు ఫ్రీ కావడానికి తీసుకువచ్చిన మందులు అనుకొని మాట్లాడుతూ ఉంటాడు.
 

66
Ennenno Janmala Bandham

ఇక ఇద్దరూ తమ తమని ఊహించుకొని మాటల యుద్ధం చేస్తూ ఉంటారు. వేద (Vedha) అక్కడి నుంచి వెళ్లి పోతుంది. యష్ (Yash) మందులు తీసుకోవాలని అనుకోటంతో అందులో ఉన్న వాటిని చూసి షాక్ అవుతాడు. వెంటనే ఆ హోటల్ వాళ్లకి ఫోన్ చేసి వాళ్లని తిట్టడంతో.. కావలసిన మందుల గురించి మాట్లాడటం తో వేద.. అయ్యో తప్పు పట్టానని అనుకోని నవ్వుకుంటుంది.

click me!

Recommended Stories