విజయ్ వారసుడు రిలీజ్ డేట్ ఫిక్స్, చివరి దశలో ష‌ూటింగ్, వైరల్ అవుతున్న లేటెస్ట్ స్టిల్స్

Published : Oct 26, 2022, 04:12 PM ISTUpdated : Oct 26, 2022, 04:14 PM IST

తెలుగు,తమిళ భాషల్లో భారీ అంచనాలతో తెరకెక్కుతోంది వారసుడు సినిమా.ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కోసం రీసెంట్ గా సాలిడ్ అప్ డేట్స్ వదిలారు టీమ్.  

PREV
15
విజయ్ వారసుడు రిలీజ్ డేట్ ఫిక్స్, చివరి దశలో ష‌ూటింగ్, వైరల్ అవుతున్న  లేటెస్ట్ స్టిల్స్

తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగులో డైరెక్ట్ గా చేస్తున్న మొదటి మూవీ వారసుడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను  శ్రీవెంకటేశ్వర క్రీయేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా  తమిళంలో వరిసు టైటిల్ తో  రిలీజ్ కానుంది. 
 

25

టాలీవుడ్ లో మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్  ఇచ్చిన వంశీ పైడిపల్లి చేస్తున్న సినిమా కావడంతో,  ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ చాలా వరకూ అయిపోయింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ ఫిక్స్ ను రిలీజ్ చేశారు టీమ్. షూటింగ్ టైమ్ లో కోన్ని ఫోటోస్ ను పంచుకున్నారు. 

35

విజయ్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా  ఈ స్టిల్స్ ఉన్నాయి.  ఇక ఈ సినిమాలో విజయ్ జోడీగా రష్మిక అలరించనుంది. ఇక  సినిమాలో, ప్రకాశ్ రాజ్, ప్రభు , శ్రీకాంత్ ,  ఖుష్బూ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.
 

45

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు విజయ్. ఇటు తెలుగులో కూడా మార్కెట్ ను భారీగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు స్టార్ హీరో. తెలుగు, తమిళ భాషల్లో సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతోంది సినిమా. ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

55

తెలుగులో మరో సినిమా కూడా చేయబోతున్నాడు విజయ్. . అసలు ఆ సినిమానే ముందు రిలీజ్ కావాల్సి ఉంది. కాని అది లేట్ అవ్వడంతో వంశీతో మూవీ చేస్తున్నాడు.   ఇక ఈ సినిమా తరువాత, తనకి  మాస్టర్ తో హిట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్ తో విజయ్ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. 

click me!

Recommended Stories