Jana Nayagan Collections: సీఎం విజయ్ దళపతి నటించిన చివరి సినిమా జననాయగన్ థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే దుమ్ము దులిపేసింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా థియేటర్లకు క్యూ కట్టారు. విజయ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత?
కోలీవుడ్ స్టార్ హీరో, 'దళపతి' విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌తో ఘన విజయాన్ని సాధిస్తోంది. గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు నుంచే థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటింది. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత విడుదలయిన ఆఖరి సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఈ చిత్రాన్ని ఒక పండగలా వేడుక చేసుకుంటున్నారు. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే సంచలనం సృష్టించిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద అనుకున్నట్లే కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.
25
జననాయగన్ కు రికార్డు స్థాయిలో వసూళ్లు
బాక్సాఫీస్ వర్గాల సమాచారం ప్రకారం తొలి రోజు రాత్రి షోలు ముగిసే సమయానికి ఈ చిత్రం భారతదేశంలో అత్యంత రికార్డు స్థాయి నెట్ వసూళ్లను సాధించింది. ఇందులో సింహభాగం తమిళనాడు నుంచే రావడం విజయ్‌కు ఉన్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌ను మరోసారి రుజువు చేసింది. తమిళ వెర్షన్‌లోనే 36.50 కోట్ల నెట్ వసూళ్ళతో అత్యధిక కలెక్షన్లు నమోదు కాగా, తెలుగు , హిందీ రాష్ట్రాల్లో కూడా సినిమాకు మంచి స్పందన లభించింది.తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు దాదాపు రూ. 2 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు రాబట్టగా, హిందీ ల్యాండ్‌లో రూ. 1 కోటికి పైగా వసూళ్లను సాధించినట్టు సమాచారం. . భారతీయ బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రూ. 50 కోట్ల నెట్ మార్కును చేరుకునే దిశగా ఈ సినిమా వేగంగా దూసుకుపోతోంది.
35
గ్లోబల్ మార్కెట్‌లో విజయ్ విధ్వంసం
భారతదేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా దళపతి విజయ్ క్రేజ్ అసాధారణంగా ఉంది. విదేశీ మార్కెట్లలో నమోదైన అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోల కలెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే, ‘జననాయగన్’ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయ్ కెరీర్‌లోనే ఇది మరొక అత్యుత్తమ, గుర్తుండిపోయే ఓపెనింగ్‌గా నిలవనుంది.
తొలి రోజు వచ్చిన అద్భుతమైన టాక్, భారీ వసూళ్లతో ఇప్పుడు అందరి దృష్టి వీకెండ్ బాక్సాఫీస్ పైనే పడింది. శుక్రవారం నుండి ఆదివారం వరకు కుటుంబ ప్రేక్షకుల సపోర్ట్ తోడైతే, ఈ సినిమా మరిన్ని పాత రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. దళపతి విజయ్ వెండితెరకు వీడ్కోలు పలుకుతూ ఇచ్చిన ఈ 'జననాయగన్' వినోదం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి
55
జన నాయగన్ లో ఎవరెవరు?
టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోత్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాలో విజయ్ దళపతి సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే యువ నటి మమితా బైజు, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. సినిమా కథలో పొలిటికల్ ఎలిమెంట్స్, సెంటిమెంట్, యాక్షన్, మరీ ముఖ్యంగా విజయ్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.