ఇలయ దళపతి విజయ్ నటించబోతున్న మొట్టమొదటి తెలుగు చిత్రం షురూ అయింది.చాలా కాలంగా 'మహర్షి' డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇలయ దళపతి విజయ్ నటించబోతున్న మొట్టమొదటి తెలుగు చిత్రం షురూ అయింది.చాలా కాలంగా 'మహర్షి' డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత దిల్ రాజు కూడా ఈ కాంబినేషన్ గురించి ప్రస్తావిస్తూ వచ్చారు.
26
Thalapathy Vijay
ఎట్టకేలకు ఈ క్రేజీ కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం అయింది. నేడు చెన్నైలో లాంఛనంగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. వంద కోట్లకు పైగా బడ్జెట్ లో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నారు. వంశీ పైడి పల్లి విజయ్ ఇమేజ్ కు తగ్గట్లుగా యాక్షన్ అండ్ మెసేజ్ తో కూడుకున్న పవర్ ఫుల్ కథని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
36
Thalapathy Vijay
ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా నేషనల్ క్రష్ రష్మిక నటించబోతోంది. పూజా కార్యక్రమంలో విజయ్, రష్మిక, దిల్ రాజు, వంశీ పైడిపల్లి ఇతర చిత్ర యూనిట్ పాల్గొన్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
46
Thalapathy Vijay
మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి మరో చిత్రానికి సైన్ చేయలేదు. మరోసారి మహేష్ బాబుతో సినిమా అంటూ వార్తలు వచ్చాయి. కానీ వంశీ పైడిపల్లి విజయ్ ని తన స్క్రిప్ట్ తో ఒప్పించారు. పూజా కార్యక్రమంలో రష్మిక క్యూట్ గా కనిపించింది. విజయ్ తో కలిసి సరదాగా ఉన్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. విజయ్ కి రష్మిక దిష్టి కూడా తీసింది. ఎక్కడున్నా రష్మిక ఇలాంగే భలే జోవియల్ గా యాక్టివ్ గా ఉంటుంది.
56
Thalapathy Vijay
ఈ చిత్రం కోసం దిల్ రాజు విజయ్ కి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం విజయ్ బీస్ట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.
66
Thalapathy Vijay
తమిళంతో పోల్చుకుంటే విజయ్ కి తెలుగులో మార్కెట్ అంతంత మాత్రమే. తమిళంలో విజయ్ కి రజనీకాంత్ స్థాయి క్రేజ్ ఉంది. తెలుగులో మార్కెట్ నామమాత్రం మాత్రమే. ఈ చిత్రంతో తెలుగులో కూడా విజయ్ కి మార్కెట్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత కావడంతో ఆయన ప్లానింగ్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.