ఈ క్రమంలో బందిపోటు, ఓయ్, అమీ తుమీ, దర్శకుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈషాకు భారీ కమర్షియల్ హిట్ పడకపోవడం మైనస్ అయ్యింది. అదే సమయంలో వివక్ష కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. తెలుగులో కన్నడ, మలయాళ, హిందీ భామల హవా నడుస్తోంది. ఇదే విషయాన్ని ఈషా రెబ్బా ఇటీవల కుండబద్దలు కొట్టారు. తెలుగు అమ్మాయిలకు తెలుగులో ఆఫర్స్ ఇవ్వడం లేదని వాపోయారు.