నాపై లైంగిక దాడి జరిగింది, సంచలన విషయాలు వెల్లడించిన వరలక్ష్మీ శరత్ కుమార్

Published : Nov 13, 2022, 08:55 PM ISTUpdated : Nov 13, 2022, 08:59 PM IST

సంచలన విషయాలు వెల్లడించారు తమిళ స్టార్ యాక్ట్రస్  వరలక్ష్మీ శరత్ కుమార్. తన ఫిల్మ్ కెరీర్ తో పాటు పర్సనల్ విషయాలను  రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తనపై లైంగిక దాడి జరిగిందంటూ.. షాకింగ్ విషయాలు వెల్లడించారు వరలక్ష్మీ.  

PREV
17
నాపై లైంగిక దాడి జరిగింది, సంచలన విషయాలు వెల్లడించిన వరలక్ష్మీ శరత్ కుమార్

తమిళ తెరతో పాటు.. తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతోంది వరలక్ష్మీ శరత్ కుమార్. తండ్రి వారసత్వాన్ని వాడకుండా... సోంత టాలెంట్ తో స్టార్ గా ఎదిగింది వరలక్ష్మీ.  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. సొంత టాలెంట్ తో ఎదుగుతూ.. ప్రయోగాత్మక పాత్రలతో దుమ్ము రేపుతోంది. 
 

27

ఇక ప్రస్తుతం ఎక్కువగా విలన్ పాత్రలు చేస్తున్న వరలక్ష్మీ. గంభీరమైన గొంతుతో.. కరుకైన మాటతో.. హావభావాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వరలక్ష్మీ... తన ఫిల్మ్ కెరీర్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. సినిమాలతో పాటు సమాజసేవ చేస్తూ.. తనమంచి మనసు చాటుకుంటున్న వరలక్ష్మీ.. తనపై లైంగిక దాడి జరిగినట్టు వెల్లడించింది. 

37
varalakshmi sarathkumar

చిన్నతనంలో తనపౌ లైంగిక దాడి జరిగిందని షాకింగ్ విషయాన్ని తెలిపింది వరలక్ష్మీ. అంతే కాదు ఓ టీవి ఛానెల్ అధినేత తనను తనతో పడుకోవాలంటూ అడిగాడని.. తను వెంటనే పోరా పోరంబోకు అంటూ చెయ్యి చేసుకోబోయే సరికి పారిపోయాడంటూ..  నమ్మలేని విషయాలు వెల్లడించారు. 
 

47

ఇక తన కెరీర్ గురించి చాలా విషయాలు చెప్పారు వరలక్ష్మీ.  తను నటి అవ్వాలి అనకున్నప్పుడు తన తండ్రి శరత్ కుమార్ వద్దన్నారని. కాని తన తల్లి రాధికాతో కలిసి శరత్ కుమార్ ను ఒప్పించారనన్నారు వరలక్ష్మీ.  తను కూడా ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశఆనన్నారు. 

57

తనకు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీతో పాటుగా ఫ్రెంచ్, స్పానిష్ కూడా వచ్చు అన్నారు. ఇక తాను చేస్తున్న సమాజ సేవ గురించి కూడా వివరించారు వరలక్ష్మీ. తన తల్లి చేస్తున్నబిజినెస్ లు మాన్పించి.. తను స్టార్ట్ చేసిన శ్రీ శక్తి  ఎన్జీవో పనులు అప్పటించిందట. అత్యాచారాలకు గురైన వారికి అండగా ఉండటం. గృహహింసకు సబంధించినవారి తరపున కోర్టుల్లో పోరాడటం లాంటివి చేస్తున్నారు
 

67

అంతే కాదు మూగజీవాలంటే వరలక్ష్మికి ప్రాణం. కొన్ని వేల కుక్కలకురోజూ ఆహారం అందిస్తుందట వరలక్ష్మి. అంతే కాదు మానసిక వేదనకు గురి అవుతున్న వారికి తమ సంస్థ సహాయం అందిస్తున్నట్టు తెలిపింది వరలక్ష్మీ. సహాయం కోరి వచ్చిన వారికి తమ సంస్థ  ద్వారా న్యయం జరిగేలా పోరాటం చేస్తామంటుంది వరలక్ష్మి. 

77

యశోద సినిమాలో ఫెర్టిలిటీ సెంటర్ ఓనర్ గా నటించింది వరలక్ష్మీ ఇలాంటి పాత్ర తన జీవితంలో మళ్ళీ వస్తుందా అని అనుకుందట. ఇక బాలయ్య - మలినేని గోపీచంద్ సినిమాలో కూడా నటిస్తోంది వరలక్ష్మి. ఈ సినిమాలో ప్లాష్ బ్యాక్ కోసం మూడు నెలలో ఆరు కేజీలు తగ్గిందట 

click me!

Recommended Stories