Ajith Political Entry: విజయ్- అజిత్ మధ్య పొలిటికల్ వార్...? పాలిటిక్స్ పై క్లారిటీ ఇచ్చిన అజిత్

First Published | Mar 4, 2022, 4:53 PM IST

తమిళ స్టార్ హీరో అజిత్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి ప్రచారం ఊపందుకుంది. మరో వైపు అజిత్, విజయ్ మధ్య పొలిటికల్ వార్ అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక అజిత్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ వస్తున్న వార్తపై స్పందించారు. 

కోలీవుడ్ లో రాజకీయాలు, సినిమామాలు సమానంగా నడుస్తుంటాయి. కొన్నేళ్లుగా అక్కడ ప్రభుత్వాలు నడిచేది సినిమాకు సంబంధించిన నాయకుల ఆద్వర్యంలోనే.  తమిళనాడులో సినీతారలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తమిళనాడును ఇప్పటి వరకూ  ఎక్కువ కాలం పాలించిన సీఎంలు కరుణానిధి, ఎంజీఆర్, జయలలితలు సినీ పరిశ్రమకు చెందిన వారే. ఇప్పుడు తమిళ రాజకీయాలు హీరోలు అజిత్, విజయ్ వైపు చూస్తున్నాయి. 

మరోవైపు ఇప్పటికీ తమిళ స్టార్ హీరోలు రాజకీయాలతో అంటకాగుతూనే ఉన్నారు. కమల్ హాసన్ పార్టీ పెట్టారు. రజనీ కాంత్ కూడా పార్టీ పెట్టి సీఎం అవ్వాలని అనుకుని వెనక్కు తగ్గారు. అటు విజయ్ కాంత్, విశాల్ లాంటివారు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. మరో వైపు స్టార్ హీరో విజయ్ కూడా పార్టి పెట్టబోతున్నారు అని ప్రచారం జరుగుతున్న టైమ్ లో  హీరో అజిత్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 
 


మరో వైపు అజిత్ రాజకీయాల్లోకి  రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు కూడా గతంలో  ఎన్నోసార్లు వచ్చాయి. ప్రతిసారి ఆ వార్తలను ఆయన ఖండించారు. అయితే ఈసారి అజిత్ రాజకీయాల్లో వస్తారని.. తమిళంలో మరో స్టార్ హీరో విజయ్ కూడా పార్టీ పెడతారని.. వీరిద్దరిమధ్యే ఫ్యూచర్ తమిళ రాజకీయాలు ఉంటాయంటూ ప్రచారం జరుగుతుంది.  

అయితే మరోసారి ఈ విషయంపై స్పందించారు అజిత్ ఈసారి ఆయన ఇదే విషయాన్నిఅజిత్ స్పష్టం చేశారు. తనకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తెలిపారు. ఇదే విషయంపై ఆయన పర్సనల్ మేనేజర్ సురేశ్ చంద్ర మాట్లాడుతూ, అజిత్ కు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలను ప్రోత్సహించవద్దని మీడియాను కోరుతున్నామన్నారు.
 

అటు విజయ్ విషయంలో కూడా ఇదే ప్రచారం జరుగుతుంది. రాజకీయాలకు రాను అంటూ సీరియస్ గా చెప్పాడు విజయ్. కాని విజయ్ ఫ్యాన్స్ తో ఆయన తండ్రి పొలిటికల్ గా యాక్టీవ్ గా ఉన్నాడు. లోకల్ గా జరిగే ఎన్నికల్లో పాల్గొని విజయ్ అభిమానులు గెలిచారు కూడా. ఒక వైపు వద్దు అంటూనే.. విజయ్ డబుల్ గేమ్ ఆడుతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. 

ఇద్దరు హీరోలు రాజకీయాల్లోకి రాము అని అంటున్నారు. కాని విజయ్ ఫ్యాన్స్ ఇప్పటికే పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. అటు అజిత్ ఫ్యాన్స్ కూడా తమ హీరో నాయకుడిగా కనిపించాలని కోరకుంటున్నారు. గతంలో ఆయన అన్నాడీఎంకేలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. అంతే కాదు జయలలిత మరణం తరువాత అన్నా డిఏంకే వారసుడు అజిత్ అంటూ అంతా మాట్లాడుకున్నారు. కాని అలాంటిదేమి లేదంటూ అజిత్ క్లారిటీ ఇచ్చారు అప్పుడు. 

ఈ స్టార్ హీరోలిద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇద్దరూ ఫ్యాన్స్ ను.. వారి ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోమంటూ చెపుతూనే ఉంటారు. ఇష్టం వచ్చింది ప్రచారం చెయ్యెద్దంటూ స్టేట్ మెంట్లు ఇస్తూనే ఉంటారు. అజిత్ అయితే అభిమాన సంఘాలు కూడా వద్దన్నాడు. తనను తలా అజిత్ అని పిలవద్దని కూడా స్టేట్ మెంట్ ఇచ్చాడు. కాని ఈ ఇద్దరు ఫ్యాన్స్ మాత్రం రెచ్చిపోయి హడావిడి చేస్తుంటారు. 

తమిళ నాట విజయ్- అజిత్ అభిమానులకు అస్సలు పడదు. వీరిద్దరి సినిమాలు రిలీజ్ అయితే అభిమానుల మధ్య గొడవులు.. సోషల్ మీడియాలో తిట్ల దండకాలు కామన్ గా జరుగుతుంటాయి. మరి వీరి పొలిటికల్ ఎంట్రీ నిజంగానే జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది. అసలే తమిళ రాజకీయాలు హాట్ హాట్ గా జరుగుతాయి. వీరిద్దరిలో ఎవరు సీఎం అయ్యి.. ఎవరు ప్రతిపక్షంలో ఉంటే.. రాజకీయం ఇంకా రసవత్తరంగా మారే అవకాశం ఉంటుందని జనాలు గుసగుసలాడుకుంటున్నారు. 

Latest Videos

click me!