Tamannaah: అందంతో హాలీవుడ్ వాళ్ళకే చెమటలు పట్టిస్తున్న తమన్నా.. కాన్ లో మిల్కీ బ్యూటీ మెరుపులు

Published : May 19, 2022, 01:33 PM IST

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు.

PREV
110
Tamannaah: అందంతో హాలీవుడ్ వాళ్ళకే చెమటలు పట్టిస్తున్న తమన్నా.. కాన్ లో మిల్కీ బ్యూటీ మెరుపులు

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. 

210

తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో Tamannaah ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. 

310

సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. 

410

తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. తాజాగా తమన్నా ప్రతిష్టాత్మక కాన్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటోంది. 

510

ఫ్రాన్స్ లోని కాన్ నగరంలో  ఫిలిం ఫెస్టివల్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో తమన్నా కళ్ళు చెదిరే కాస్ట్యూమ్స్ లో మెరుపులు మెరిపిస్తోంది. వివిధ రకాల కాస్ట్యూమ్స్ లో తమన్నా హొయలు ఒలికిస్తూ కేన్స్ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హాలీవుడ్ వాళ్ళకి సైతం చెమటలు పట్టించేలా తమన్నా అందాలు ఒకలబోస్తోంది. 

610

తాజాగా తమన్నా థైస్ స్ల్పిట్ బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ చూపరులని ఆకర్షించింది. కళ్ళు చెదిరేలా అందాల వెలుగుతో ప్రతి ఒక్కరిని తమన్నా ఆకర్షిస్తోంది. తమన్నా అందం చూపు తిప్పుకోలేని విధంగా ఉందంటే అతిశయోక్తి కాదు. చిరునవ్వులు చిందిస్తూ తమన్నా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

710

ఏది ఏమైనా తమన్నా ఫోటోస్ నెటిజన్లని ఆకట్టుకుంటూ వైరల్ గా మారాయి. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ Chiranjeevi భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

810

తమన్నా గతంలో చిరంజీవి సైరా చిత్రంలో నటించింది. అయితే అది ఫుల్ లెన్త్ హీరోయిన్ పాత్ర కాదు. భోళా శంకర్ చిత్రంలో తమన్నా పూర్తి స్థాయిలో హీరోయిన్ గా నటించనుంది. దీనితో మెగాస్టార్, మిల్కీ బ్యూటీ జోడి వెండితెరపై ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

910

తమన్నా హీరోయిన్ రోల్స్ తో పాటు స్పెషల్ సాంగ్స్ లో కూడా మెప్పిస్తోంది. తమన్నా చేసే ప్రతి స్పెషల్ సాంగ్ మాస్ ప్రేక్షకులకు పండగే. జై లవకుశ చిత్రంలో తమన్నా చేసిన స్వింగ్ జరా సాంగ్ ఇప్పటికి యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 

1010

తమన్నా త్వరలో ఎఫ్ 3 చిత్రంతో సందడి చేయబోతోంది. ఈ మూవీలో తమన్నా వెంకటేష్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే.  తమన్నా ఎఫ్3 లో మరింత హాట్ హాట్ గా కనిపించబోతోంది. 

click me!

Recommended Stories