టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి ఎట్టకేలకు ఓ ఇంటి వాడయ్యాడు. ఆయన హీరోయిన్ నిక్కీ గల్రానీని వివాహం చేసుకున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ స్టార్ హోటల్‌లో వీరి వివాహం బుధవారం రాత్రి జరిగింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనలోని వర్సెటైల్ యాక్టర్‌ని ఆవిష్కరిస్తూ తనకంటూ ఓ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి గత కొంత కాలంగా నిక్కీ గల్రానీతో ప్రేమలో ఉన్నారు. మార్చిలో ఈ ఇద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకోగా, తాజాగా బుధవారం(మే 18)న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. Aadi PiniShetty Nikki Galrani Wedding Photos.
29
Aadi PiniShetty Nikki Galrani Wedding Photos.
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ వివాహ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకి హాజరు కావడం విశేషం. అంతకు ముందు జరిగిన హల్డీ వేడుకలో నాని, సందీప్ కిషన్ పాల్గొని సందడి చేశారు. డాన్సులు చేసి రచ్చ చేశారు. ప్రస్తుతం ఆది పినిశెట్టి మ్యారేజ్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు వారికి అభినందనలు తెలియజేస్తున్నారు.
39
Aadi PiniShetty Nikki Galrani Wedding Photos.
త్వరలో ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రానీని జంట సినీ సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇండస్ట్రీని ఆహ్వానించి విందు ఇవ్వబోతున్నారట. ఈ వీకెండ్‌లో ఉండబోతుందని సమాచారం.
49
Aadi PiniShetty Nikki Galrani Wedding Photos.
ఆది, నిక్కీలు ఎంతోకాలంగా ప్రేమించుకుంటున్నారు. 2015లో వచ్చిన `యాగవరైనమ్ నా కక్కా`(మలుపు) అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన ఈ హీరోహీరోయిన్లు `మరగాధ నాణ్యం` చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
59
Aadi PiniShetty Nikki Galrani Wedding Photos.
ఇక ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆదిపినిశెట్టి కావడం విశేషం. `ఒక వి చిత్రం` చిత్రంతో ఆయన హీరోగా తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఇది మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత వరుసగా తమిళ సినిమాల్లో నటించాడు. ఐదేళ్ల తర్వాత `గుండెల్లో గోదారి` సినిమాలో హీరోగా నటించారు ఆది పినిశెట్టి.
69
Aadi PiniShetty Nikki Galrani Wedding Photos.
`మలుపు` సినిమా వరకు తమిళంలోనే నటించిన ఆయన ఆ తర్వాత తెలుగుపై ఫోకస్ పెట్టారు. తెలుగులో ఆఫర్లు వరుసగా క్యూ కట్టాయి. దీంతో హీరోగానే కాకుండా విలన్‌గా, బలమైన పాత్రల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు ఆది.
79
Aadi PiniShetty Nikki Galrani Wedding Photos.
`సరైనోడు`, `నిన్ను కోరి`, `అజ్ఞాతవాసి`, `రంగస్థలం`, `నీవెవరో`, `యూటర్న్`, `గుడ్‌లఖ్ సఖీ`, `క్లాప్` చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న `ది వారియర్`లో విలన్‌గా నటిస్తున్నారు.
89
Aadi PiniShetty Nikki Galrani Wedding Photos.
కన్నడకి చెందిన నిక్కీ గల్రానీ.. సంజనా గల్రానీ సిస్టరే కావడం విశేషం. మలయాళం, కన్నడ, తమిళ సినిమాలు చేసుకుంటూ వచ్చిన నిక్కీ గల్రానీ.. సునీల్ హీరోగా నటించిన `కృష్ణాష్టమి` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పరాజయం చెందడంతో మళ్లీ తెలుగు సినిమాలు చేయలేదు. కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్‌లో బిజీగా ఉంది.
99
Aadi PiniShetty Nikki Galrani Wedding Photos.
టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీని మ్యారేజ్ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.