Tamannaah: చిత్రవిచిత్రంగా తమన్నా ప్యాంట్.. మెరుపులు మెరిపిస్తూ ఆశ్చర్యంలో ముంచెత్తిన మిల్కీ బ్యూటీ

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 28, 2022, 10:01 PM IST

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు.

PREV
18
Tamannaah:  చిత్రవిచిత్రంగా తమన్నా ప్యాంట్.. మెరుపులు మెరిపిస్తూ ఆశ్చర్యంలో ముంచెత్తిన మిల్కీ బ్యూటీ

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. 
 

28

తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో Tamannaah ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. 

38

హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. 

48

తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. తాజాగా తమన్నా ముంబై ఎయిర్ పోర్ట్ లో మెరిసింది. ఆమె బయట కనిపించగా కెమెరాలన్నీ క్లిక్కు మన్నాయి. 

58

తమన్నా ధరించిన డ్రెస్ ట్రెండీగా ఉన్నపటికీ కొంత విచిత్రంగా కూడా ఉంది. గ్రీన్ టాప్ ధరించిన తమన్నా ఎద అందాలతో కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. గ్రీన్ టాప్ పై తమన్నా రెడ్ జాకెట్ ధరించింది. అంతవరకు ఓకే కానీ తమన్నా ధరించిన జీన్స్ ప్యాంట్ చూసి అంతా ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. ఈ రోజుల్లో చిరిగిన జీన్స్ ట్రెండే.. కానీ తమన్నా ప్యాంట్ మరీ విచిత్రంగా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

68

ఏది ఏది ఏమైనా తమన్నా ఫోటోస్ నెటిజన్లని ఆకట్టుకుంటూ వైరల్ గా మారాయి. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ Chiranjeevi భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

 

78

తమన్నా గతంలో చిరంజీవి సైరా చిత్రంలో నటించింది. అయితే అది ఫుల్ లెన్త్ హీరోయిన్ పాత్ర కాదు. భోళా శంకర్ చిత్రంలో తమన్నా పూర్తి స్థాయిలో హీరోయిన్ గా నటించనుంది. దీనితో మెగాస్టార్, మిల్కీ బ్యూటీ జోడి వెండితెరపై ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

 

88

తమన్నా హీరోయిన్ రోల్స్ తో పాటు స్పెషల్ సాంగ్స్ లో కూడా మెప్పిస్తోంది. తమన్నా చేసే ప్రతి స్పెషల్ సాంగ్ మాస్ ప్రేక్షకులకు పండగే. జై లవకుశ చిత్రంలో తమన్నా చేసిన స్వింగ్ జరా సాంగ్ ఇప్పటికి యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 

click me!

Recommended Stories