ప్రస్తుతం తమన్నా తెలుగులో సినిమాలు చేయడం లేదు. కానీ తమిళం, హిందీలో మాత్రం అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో ఆమె `పురుషన్` చిత్రంలో నటిస్తుండగా, హిందీలో మాత్రం ఐదు సినిమాలు చేస్తోంది. అందులో `వీవ్యాన్`, `రాగిని 3`, `రేంజర్స్`, `వి శాంతారం`, `మారియా ఐపీఎస్` వంటి చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ఆమె చివరగా `ఓడెల 2` చిత్రంలో నటించింది.