F3 మూవీ విషయంలో తమన్నా హర్ట్ అయ్యిందా.. అలకకి కారణం ఇదే ?

Published : May 24, 2022, 10:02 PM IST

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్3 తెరకెక్కింది.

PREV
16
F3 మూవీ విషయంలో తమన్నా హర్ట్ అయ్యిందా.. అలకకి కారణం ఇదే ?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్3 తెరకెక్కింది. మే 27న ఎఫ్ 3 చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది.  

26
Tamannaah Bhatia

వెంకటేష్, వరుణ్ తేజ్ కలసి మరోసారి నవ్వులు పూయించేందుకు రెడీ అవుతున్నారు. వీళ్లిద్దరి సరసన తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. ఎఫ్2 ని మించేలా ఎఫ్3 లో కామెడీ డోస్ ఉండబోతోంది. ఈ చిత్రంలో వెంకటేష్ రేచీకటి ఉన్న వ్యక్తిగా.. వరుణ్ తేజ్ నత్తి ఉన్న యువకుడిగా కనిపించబోతున్నారు. 

36
Tamannaah

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎఫ్ 3 ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ పాల్గొంటున్నారు. మెహ్రీన్ కూడా ఉంటోంది. కానీ తమన్నా ఉంటే ఫ్యాన్స్ కి ఆ కిక్కే వేరు. తమన్నా ఎఫ్3 ప్రమోషన్స్ లో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. 

46

మొన్నటివరకు తమన్నా కేన్స్ లో బిజీగా గడిపింది. అది ఒక కారణం కావచ్చు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ముగిసిన తర్వాత కూడా తమన్నా ఎఫ్3 ప్రమోషన్స్ లో జాయిన్ కాలేదు. అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

56

తమన్నా ఎఫ్ 3 విషయంలో హర్ట్ అయిందని.. అందుకే దూరంగా ఉంటోందని అంటున్నారు. తమన్నా అలకకి కారణం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.  ఎఫ్3 లో సోనాల్ చౌహన్ పాత్రకి ప్రాధాన్యత పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో తమన్నా పాత్ర కాస్త తగ్గిందట. అయితే ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ.. తమన్నా అలకకి కారణం ఇదే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. 

 

66

మరి తమన్నా ఈ గాసిప్ కి చెక్ పెడుతూ ఎఫ్ 3 ప్రమోషన్స్ లో రంగంలోకి దిగుతుందో లేదో చూడాలి. రిలీజ్ కి ఇక మూడు రోజుల టైం మాత్రమే ఉంది. ఏది ఏమైనా అనిల్ రావిపూడి ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ లని మరింత అందంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 

click me!

Recommended Stories