Tamannaah: క్యాష్ షోలో ఒక్కసారిగా కన్నీరు మున్నీరైన తమన్నా.. అందరి కళ్లలో విషాదం, ఏం జరిగింది?

Published : May 10, 2022, 10:19 AM IST

ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న క్యాష్ ప్రోగ్రాం ప్రేక్షకులని అలరిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈవారం ప్రసారం కాబోయే క్యాష్ ప్రోగ్రాం ఎపిసోడ్ ప్రోమోని తాజాగా విడుదల చేశారు.

PREV
16
Tamannaah: క్యాష్ షోలో ఒక్కసారిగా కన్నీరు మున్నీరైన తమన్నా.. అందరి కళ్లలో విషాదం, ఏం జరిగింది?

ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న క్యాష్ ప్రోగ్రాం ప్రేక్షకులని అలరిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈవారం ప్రసారం కాబోయే క్యాష్ ప్రోగ్రాం ఎపిసోడ్ ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ చాలా స్పెషల్. ఎందుకంటే 14న ప్రసారం కాబోయే ఎపిసోడ్ తో క్యాష్ షో 200 వ ఎపిసోడ్ పూర్తి చేసుకోనుంది. 

26

ఈ స్పెషల్ షోకి అంతే ప్రత్యేకమైన గెస్ట్ లని ఆహ్వానించారు. అది మరెవరో కాదు.. ఎఫ్3 టీమ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్3. ఎఫ్ 2 కి ఇది సీక్వెల్ గా వస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ వరుణ్ కి జోడిగా తమన్నా, మెహ్రీన్ నటిస్తున్నారు. వీరిద్దరితో పాటు హాట్ బ్యూటీ సోనాల్ చౌహన్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. 

36

ఎఫ్ 3 టీమ్ తమన్నా, అనిల్ రావిపూడి, సోనాల్ చౌహన్, సునీల్ తాజాగా క్యాష్ షోలో మెరిశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలై వైరల్ గా మారింది. 200 ఎపిసోడ్ కావడంతో సుమ ఎఫ్3 టీం తో బాగా హంగామా చేసింది. తమన్నా రాగానే పాల గ్లాసుతో స్వాగతం పలికింది. మిల్క్.. బ్యూటీ అంటూ జోకులు వేసింది. 

46

ఇక సోనాల్ చౌహన్ రాగానే.. ఇక్కడ వాతావరణం హాట్ గా మారిపోయింది అంటూ ఆమె హాట్ నెస్ గురించి చెప్పింది. సునీల్, అనిల్ కూడా షోలోకి ఎంటర్ అయ్యారు. ఎఫ్3 టీం తో సుమ సరదా స్కిట్ లు చేయించింది. ఓ స్కిట్ లో సుమ, సునీల్ భార్య భర్తలుగా నటించి బాగా నవ్విస్తున్నారు. 

56

షోకి హాజరైన బాయ్స్ కొందరు రోజెస్ తీసుకుని మోకాళ్లపై నిలబడి తమన్నాకి ప్రపోజ్ చేశారు. వాళ్ళని చూసి తమన్నా మురిసిపోతున్న దృశ్యాలు చాలా అందంగా ఉన్నాయి. సునీల్ మాట్లాడుతూ.. ఎఫ్ 3 మాములుగా ఉండబోవడం లేదని.. క్యాష్ ప్రోగ్రాం లాగా 200 రోజులు కొల్లగొట్టబోతున్నాం అని తెలిపారు. 

66

ఇక ప్రోమో చివర్లో ఎమోషనల్ గా మారింది. తమన్నా కంటతడి పెట్టుకుంటూ దృశ్యాలు అనిపిస్తున్నాయి. దీనితో అక్కడ అందరి కళ్ళల్లో విషాదం కనిపిస్తోంది. తమన్నా ఎందుకు కన్నీరు పెట్టుకుంటోంది.. ఆమె తన లైఫ్ గురించి ఏమైనా గుర్తు చేసుకుందా.. ఈ వివరాలు తెలియాలంటే 14న ప్రసారం కాబోయే క్యాష్ షో చూడాల్సిందే. 

click me!

Recommended Stories