అందాల వరదకు అడ్డుకట్ట వేసి.. నిండుగా మెరిసిన మిల్క్ బ్యూటీ.. చీరకట్టులో మెరిసిపోతున్న తమన్నా..

First Published | Aug 7, 2023, 1:28 PM IST

మిల్క్ బ్యూటీ కొద్దిరోజులుగా స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. నెట్టింట అందాల వరద పారిస్తోంది. చాలా రోజుల తర్వాత నిండుగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia)  పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటున్న విషయం తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ లో రూటు మార్చేసిన ఈ ముద్దుగుమ్మ సెన్సేషన్ గా మారింది. ఊహించని విధంగా షాక్ లు ఇస్తోంది. 
 

కొన్నేళ్ల పాటు తమన్నా తెలుగు, తమిళంలో సినిమాలు చేసింది. బ్యూటీఫుల్ రోల్స్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కానీ ఎప్పుడూ బోల్డ్ షోకు ఓకే చెప్పలేదు. కానీ లిప్ లాక్ కూడా ఒప్పుకోలేదు. కానీ ప్రస్తుతం కెరీర్ లో స్పీడ్ పెంచేందుకు ఆ రూల్స్ ను బ్రేక్ చేసింది. 


‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ వంటి సిరీస్ ల్లో బోల్డ్ పెర్ఫామెన్స్ తో రెచ్చిపోయింది. విజయ్ వర్మకు ఏకంగా లిప్ లాక్ చేసి షాకిచ్చింది. దీంతో తమన్నా పేరు మారుమోగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అందాల వరద పారిస్తోంది. తన సినిమాలను ప్రమోట్ చేసుకునే క్రమంలో సెక్సీ అవుట్ ఫిట్లలో మెరిసి గ్లామర్ విందు చేస్తోంది. 
 

మిల్క్ బ్యూటీని సంప్రదాయ దుస్తుల్లో నిండుగా, పద్ధతిగా చూసి చాలా రోజులు అవుతుందని పలువురు నెటిజన్లు అభిప్రాపడుతున్న వేళ.. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చింది. గ్లామర్ షోకు ఛాన్స్ లేకుండా కనిపించింది. అదిరిపోయే శారీలో, ఆకర్షించే ఆభరణాలు ధరించి వజ్రంలా వెలిగిపోతోంది. 
 

మిల్క్ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ కు ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. యంగ్ బ్యూటీ రాశీఖన్నా కూడా ఫిదా అయ్యింది. బ్యూటీ అంటూ కామెంట్ చేసింది. అభిమానులతో పాటు నెటిజన్లు కూడా తమన్నా లుక్ కు మంత్రముగ్ధులవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

ఇక తమన్నా మెగాస్టార్ చిరంజీవి సరసన Bholaa Shankar  మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 11న విడుదల కాబోతోంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో జరిగింది. కానీ తమన్నా హాజరుకాలేదు. కీర్తి సురేష్ హాజరై తమన్నాను వేదికపై గుర్తు చేశారు. 
 

Latest Videos

click me!