ఒంటినిండా దీపావళి కాంతులు నింపుకున్న తమన్నా.. చీరకట్టులో ఆ మత్తు ఫోజులు చూస్తే అంతే..

First Published | Nov 6, 2023, 9:57 AM IST

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా వరుస ప్రాజెక్ట్స్ తో అలరించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నుంచి వచ్చిన సిరీస్ తో సెన్సేషన్ గా మారిన తమన్నా.. ప్రస్తుతం నయా లుక్స్ తో మతులు పోగొడుతోంది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia)  గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఊపూపింది. బడా హీరోల సరసన నటించి మెప్పించింది. తన అందం, డాన్స్, పెర్ఫామెన్స్ తో స్పెషల్ ఇమేజ్ ను సాధించుకుంది.
 

ప్రస్తుతం తమన్నా కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా బాలీవుడ్ లో ఎక్కువగా సందడి చేస్తోంది. ఇప్పటికీ ఇండస్ట్రీలో లీడ్ పొజీషిన్ లోనే ఉండేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. చివరిగా వచ్చిన ‘లస్ట్ స్టోరీస్2’, ‘జీ కర్దా’ వంటి చిత్రాలతో సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే.


బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఎవరూ ఊహించని విధంగా షాకిచ్చింది. ప్రస్తుతం మిల్క్ బ్యూటీ పంథా కొనసాగుతోంది. నెక్ట్స్ ఎలాంటి ప్రాజెక్ట్స్ తో రాబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ‘బంద్రా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

రీసెంట్ గానే ఈమూవీ టీజర్ విడుదలై ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆ చిత్ర ప్రమోషన్స్ లోనే తమన్నా బిజీగా ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ల్లోనూ తెగ సందడి చేస్తోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ నయా లుక్ తో మతులు పోగొడుతోంది. 
 

తాజాగా తమన్నా చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్లూ శారీలో మెరుపులు మెరిపించింది. దివి నుంచి దిగొచ్చిన తారలా మెరిసింది. దీపావళి కాంతులను ఒంటినిండా నింపుకున్నట్టుగా ఫొటోషూట్ చేసింది. మరోవైపు చీరకట్టులోని అందాలను కూడా ప్రదర్శించింది. 

స్లీవ్ లెస్ బ్లౌజ్, మతిచెగొట్టేలా చీరకట్టులో గ్లామర్ విందు చేసింది. మత్తెక్కించే ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. టాప్ గ్లామర్ తో మైమరిపించింది. ఈ ఫొటోలను పంచుకుంటూ తన అభిమానులకు ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

Latest Videos

click me!