లలిత్ మోదీకి బ్రేకప్ చెప్పిన సుస్మిత సేన్..? విమర్షలు పట్టించుకోనన్న బ్యూటీ..

Published : Aug 06, 2023, 01:48 PM IST

ఎప్పుడూ ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్ బ్యూటీ..మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్. తాజాగా మరాసారి న్యూస్ ఐటమ్ గా మారారు.. ఇంతకీ ఆమె ఏ విషయంలో హైలెట్ అవుతున్నారు.  

PREV
16
లలిత్ మోదీకి బ్రేకప్ చెప్పిన సుస్మిత సేన్..? విమర్షలు పట్టించుకోనన్న బ్యూటీ..

మరోసారి వార్తల్లో నిలిచింది మాజీ విశ్వ సుందరి... బాలీవుడ్ సీనియర్ నటి  సుస్మితా సేన్. గత ఏడాది  ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ.. సుస్మితా సేన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది నటి.  అంతే కాదు.. లలిత్ తో కలిసి సుస్మితా మాల్దీవుల ట్రిప్ కు కూడా వేసి అక్కడ బాగా  ఎంజాయ్ చేశారు కూడా. 

26

అంతే కాదు అక్కడ దిగిన ఫోటోలు శేర్ చేస్తూ.. కొత్త జీవితం స్టార్ట్ కాబోతోంది అంటూ ప్రకటించారు ఈ జంట. దాంతో వీరి పెళ్లి ఖాయం అనుకున్నారు అంతా.. కాని అందరూ అనుకున్నట్టు జరగలేదు. ఈపోస్ట్ పెట్టిన కొన్నిరోజులకే..సుస్మితా.. తన పాత బాయ్ ఫ్రెండ్ తోనే కనిపించింది.. ఇద్దరు కలిసి షికార్లు తిరగడం కూడా వైరల్ అయ్యింది. 

36

అయితే తాజాగా లలిత్ మోడీతో సుస్మితా సేజ్ అఫిషియల్ గా విడిపోయినట్టు తెలుస్తుంది. త్వరలో సుస్మితా తాళి అనే సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సిరీస్ ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో సుస్మితా ఈ సిరిస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఈ ప్రమోషన్స్ లో లలిత్ మోదీతో రిలేషన్ షిప్ గురించి మాట్లాడింది. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. 

46

లలిత్ మోడీ విషయంలో గట్టిగా ట్రోలింగ్ ఎదుర్కొంది సుస్మితా సేన్.. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కొంటోంది. 'గోల్డ్ డిగ్గర్' అంటూ ఆమెను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ... డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి అంటూ తనను విమర్శిస్తున్నారని... ఇలాంటి విమర్శలను తాను పట్టించుకోనని అన్నారు. 

56
Sushmita Sen

అవమానాలను స్వీకరించడం అంటే అది అవమానమేనని, అందుకే తాను స్వీకరించనని చెప్పారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని చెప్పారు. లలిత్ మోడీ విషయంలో ఎంత మంది ఏం అన్నా.. పట్టించుకోను అన్నారు. 
 

66
Sushmita Sen

అంతే కాదు తనపై వచ్చే కామెంట్లపై స్పందించవద్దని ఇండస్ట్రీలోని ఎంతో మంది తనకు చెప్పారని ఆమె  అన్నారు. అంతే కాదు తనకు సంబంధించిన విషయాలు కాని,తన పర్సనల్ విషయాలు కానితనకు నచ్చినప్పుడు,తనకు ఇష్టం వచ్చినప్పుడు స్పందిస్తానని చెప్పారు. తనకు గోల్డ్ కంటే డైమండ్స్ ఇష్టమని... తన కోసం వాటిని కొంటుంటానని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories