బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత పోలీసులు పలువురిని విచారించారు. అయితే, సుశాంత్ హత్యపై ఆయన గర్ల్ ఫ్రెండ్, మరింత మందిపై ఆరోపణలు చేస్తూ తండ్రి కెకే సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరిగింది. పాట్నా పోలీసులు సుశాంత్ తండ్రి చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు.
undefined
పాట్నా పోలీసుల నుంచి తప్పించుకున్న రియా చక్రవర్తి కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. సుశాంత్ సింగ్ జూన్ 14వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు దాదాపు 40 మందిని విచారించారు. రియా చక్రవర్తిని, అతని సహనటులను, నిర్మాతలను, డాక్టర్లను విచారించారు.
undefined
అయితే, సుశాంత్ సింగ్ తండ్రి ఫిర్యాదుతో కేసు మలుపు తీసుకుంది. రియా విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ సింగ్ విషయంలో రియా చక్రవరి కుట్రపూరితంగా వ్యవహరించిందనేది ఆయన ఆరోపణ. ఆయన వ్యక్తం చేసిన అనుమానాలు ఈ విధంగా ఉన్నాయి.
undefined
2019కి ముందు నా కుమారుడికి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేవు. రియా చక్రవర్తితో సంబంధంలోకి వచ్చిన తర్వాతనే ఎందుకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి?
undefined
ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కుటుంబ సభ్యులను ఎందుకు సంప్రదించలేదు, చికిత్స కోసం వారి మౌఖిక లేదా రాతపూర్వక అనుమతిని ఎందుకు తీసుకోలేదు?
undefined
రియా సూచన మేరకు నా కుమారుడికి చికిత్స చేసిన వైద్యులు కూడా కుట్రలో పాత్రధారులేనని నేను నమ్ముతున్నాను.
undefined
నా కుమారుడికి మానసకి సమస్యలు తలెత్తినప్పుడు రియా అతనికి అండగా నిలువలేదు. పత్రాలన్నీ తీసుకుని వెళ్లిపోయి నా కుమారుడిని ఒంటరిగా వదిలేసింది. దాంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
undefined
నా కుమారుడి బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తే తొలుత 17 కోట్ల రూపాయలు ఉన్నట్లు తేలింది. వాటిలో 15 కోట్ల రూపాయలు వేరే ఖాతాకు బదిలీ అయ్యాయి. దీనిపై దర్యాప్తు చేయాలి.
undefined
రియాతో సంబంధంలోకి వచ్చిన తర్వాత నా కుమారుడికి సినిమా ఆఫర్లు రావడం ఆగిపోయాయి. ఎందుకలా జరిగిందో దర్యాప్తు చేయాలి.
undefined
తన మిత్రుడు మహేష్ తో కలిసి నా కుమారుడు కూర్గ్ లోని ఆర్గానికి ఫార్మింగ్ లోకి వెళ్లాలని అనుకున్నాడు. రియా దానిపై గొడవ చేసింది. అలా చేస్తే చికిత్సకు సంబంధించిన పత్రాలను మీడియాకు విడుదల చేసి కెరీర్ ను నాశనం చేస్తానని బెదిరించింది.
undefined
సుశాంత్ నుంచి ఇక వచ్చేవి లేవని భావించిన తర్వాత అతని చికిత్సకు సంబంధించిన పత్రాలను, ల్యాప్ టాప్ ను, క్రెడిట్ కార్డులను, ఆభరణాలను, నగదును తీసుకుని వెళ్లిపోియంది.
undefined
నా కుమారుడితో మాట్లాడడానికి నేను చాలా సార్లు ప్రయత్నించాను. రియా, ఆమె అనుచరులు, కుటుంబ సభ్యులు నా ప్రయత్నాన్ని దెబ్బ తీశారు. నా కుమారుడితో నన్ను మాట్లాడకుండా చేశారు.
undefined