Scene Box Office Collection: సూర్య `సీన్` ఫస్ట్ డే కలెక్షన్స్.. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ రికార్డ్ బ్రేక్

Published : Nov 07, 2026, 02:33 PM IST

Scene Box Office Collection: దీపావళి కానుకగా విడుదలైన సూర్య 'సీన్' సినిమా బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్ నమోదు చేసింది. సూర్య గత రెండు సినిమాల తొలిరోజు కలెక్షన్లను సీన్ దాటేసింది.

PREV
14
సీన్ సినిమా తొలిరోజు కలెక్షన్స్

సూర్య నటించిన 'సీన్' సినిమా నవంబర్ 6న దీపావళి కానుకగా విడుదలై తొలిరోజే భారీ కలెక్షన్లు రాబట్టింది. మలయాళ డైరెక్టర్ జిత్తు మాధవన్ తెరకెక్కించిన ఈ సినిమాలో నజ్రియా నజీమ్, నస్లెన్ కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్, కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ సాక్నిల్క్ (Sacnilk) ప్రకారం, తొలిరోజు ఇండియాలో రూ.19.15 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ.34.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

24
తమిళ, తెలుగు భాషల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత?

ఇండియన్ కలెక్షన్లలో తమిళ వెర్షన్ ముఖ్య పాత్ర పోషించింది. తొలిరోజు తమిళ వెర్షన్ నుంచి రూ.16.15 కోట్ల నెట్ రాగా, తెలుగు వెర్షన్ రూ.3 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియాలో మొత్తం నెట్ కలెక్షన్లు రూ.19.15 కోట్లు కాగా, పన్నులతో కలిపి గ్రాస్ కలెక్షన్లు రూ.22.25 కోట్లుగా నమోదయ్యాయి. ఓవర్సీస్ లో రూ.12 కోట్లు వసూలు చేసింది. తొలిరోజే సుమారు 14.31 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.

34
కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలను దాటేసిన సీన్

ఈ ఏడాది సూర్య నటించిన ‘కరుప్పు’, 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 'కరుప్పు' తొలిరోజు రూ.15.50 కోట్లు, 'విశ్వనాథ్ అండ్ సన్స్' రూ.15.35 కోట్లు ఇండియాలో నెట్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు 'సీన్' రూ.19.15 కోట్లతో ఆ రెండు సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. దీంతో ఈ ఏడాది సూర్య సినిమాల్లో బెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా 'సీన్' నిలిచింది.

44
రూ.100 కోట్లు చేరుకుంటుందా?

దీపావళి పండుగ సందర్భంగా వరుస సెలవులు రావడం ఈ సినిమా కలెక్షన్లకు కలిసొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం పెరిగితే రాబోయే రోజుల్లో కలెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉంది. తొలిరోజు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.100 కోట్లు చేరుకుంటాయా అనే అంచనాలు అభిమానుల్లో నెలకొన్నాయి. అయితే రాబోయే రోజుల కలెక్షన్లను బట్టి సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories