ఎప్పటికీ ఆమె మాత్రమే నా ఫేవరెట్ హీరోయిన్, తన తండ్రితో 30 సినిమాల్లో నటించిన నటిపై మహేష్ కామెంట్స్

Published : Apr 05, 2025, 06:13 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో సమంత, అనుష్క శెట్టి, కాజల్, ఇలియానా లాంటి స్టార్ హీరోయిన్లతో నటించారు. అనేక సూపర్ హిట్ చిత్రాలు అందుకున్నారు. అయితే మహేష్ కి ఈ తరం హీరోయిన్లలో బాగా ఇష్టమైన నటి ఎవరూ లేరట.

PREV
14
ఎప్పటికీ ఆమె మాత్రమే నా ఫేవరెట్ హీరోయిన్, తన తండ్రితో 30 సినిమాల్లో నటించిన నటిపై మహేష్ కామెంట్స్
Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో సమంత, అనుష్క శెట్టి, కాజల్, ఇలియానా లాంటి స్టార్ హీరోయిన్లతో నటించారు. అనేక సూపర్ హిట్ చిత్రాలు అందుకున్నారు. అయితే మహేష్ కి ఈ తరం హీరోయిన్లలో బాగా ఇష్టమైన నటి ఎవరూ లేరట. తాను అమితంగా అభిమానించే హీరోయిన్ ఒకరున్నారని, చిన్నప్పటి నుంచి ఆమె అంటే ఇష్టం అని మహేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

24

మహేష్ కి అంతలా ఇష్టమైన హీరోయిన్ ఇంకెవరో కాదు.. అతిలోక సుందరి శ్రీదేవి. మహేష్ బాబు, శ్రీదేవి కలసి నటించలేదు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో మాత్రం శ్రీదేవి 30 పైగా చిత్రాల్లో నటించింది. మీకు చిన్నప్పుడు ఏ హీరోయిన్ అంటే ఇష్టం ఉండేది అని యాంకర్ అడిగింది. 

34

దీనికి మహేష్ సమాధానం ఇస్తూ చిన్నప్పుడు మాత్రమే కాదు ఎప్పటికీ నా ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి మాత్రమే అని మహేష్ తెలిపారు. మహేష్ బాబు అతిథి చిత్రంలో కూడా శ్రీదేవి గురించి సరదాగా ఒక డైలాగ్ ఉంటుంది. నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని హీరోయిన్ అడిగితే.. అవును శ్రీదేవిని ప్రేమించాను అని మహేష్ అంటాడు. 

44
sridevi

మరి నీ ప్రేమని ఆమెకి చెప్పవా అని అడిగితే.. 15 ఏళ్ళ ముందు పుట్టి ఉంటె చెప్పేవాడిని అంటూ మహేష్ ఫన్నీగా చెబుతాడు. శ్రీదేవి ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ లతో పాటు ఆ తర్వాత తరం హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున తో కూడా హీరోయిన్ గా నటించారు. 

Read more Photos on
click me!

Recommended Stories