Suman Shetty: తనూజ విషయంలో నన్ను బ్యాడ్‌ చేశారు, బిగ్‌ బాస్‌ మోసాన్ని బయటపెట్టిన సుమన్‌ శెట్టి.. భార్య కన్నీళ్లు

Published : Dec 27, 2025, 08:09 PM IST

సుమన్ శెట్టికి బిగ్‌ బాస్‌ చేసిన మోసాన్ని బయటపెట్టారు. ఫ్యామిలీ వీక్‌లో తన భార్య చెప్పిన మాటలను బిగ్‌ బాస్‌ తప్పుగా చూపించారని వెల్లడించారు. దీని వల్ల తన భార్య మూడు రోజులు తినకుండా కన్నీళ్లు పెట్టుకుందన్నారు. 

PREV
15
టాప్‌ 5కి వెళ్లలేకపోయిన సుమన్‌ శెట్టి

బిగ్‌ బాస్ తెలుగు 9 ముగిసింది. కళ్యాణ్‌ పడాల విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న సుమన్‌ శెట్టి 14వ వారం హౌజ్‌ ని వీడాడు. టాప్‌ 5 ఎంపికకి ముందే ఆయన ఎలిమినేట్‌ అయ్యాడు. టాప్ 5లో ఉంటాడనుకున్న సుమన్‌ శెట్టి అనూహ్యంగా హౌజ్‌ని వీడటం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆడియెన్స్ అంతా ఆయన కచ్చితంగా టాప్‌ 5లో ఉంటాడనుకున్నారు. కానీ అలా జరగలేదు. కళ్యాణ్‌తోపాటు తనూజ, ఇమ్మాన్యుయెల్‌, సంజనా, డీమాన్‌ పవన్‌ టాప్‌ 5లో ఉన్న విషయం తెలిసిందే. 

25
సుమన్‌ శెట్టి భార్య మాటలు ఆయనకు నెగటివ్‌ అయ్యాయా?

ఇదిలా ఉంటే తాజాగా సుమన్‌ శెట్టి బిగ్‌ బాస్‌ పై షాకింగ్‌ కామెంట్స్ చేశారు. తనని బ్యాడ్‌ చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనూజ విషయంలో తనని నెగటివ్‌ చేశారని, దీని కారణంగా తన భార్య మూడు రోజులు అన్నం తినకుండా కన్నీళ్లు పెట్టుకుందని తెలిపారు. మరి ఇంతకి ఏం జరిగిందంటే? ఫ్యామిలీ వీక్‌లో సుమన్‌ శెట్టి భార్య నాగ భవాని వచ్చింది. ఆమె సుమన్‌ శెట్టి ఆట గురించి పాజిటివ్‌గా చెప్పింది. బాగా ఆడుతున్నావని పేర్కొంది. అదే సమయంలో తనూజ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వారికి దూరంగా ఉండాలని తెలిపింది. ఈ విషయాన్ని ఆ రోజు ఎపిసోడ్‌లో సబ్‌ టైటిల్స్ లో వేశారు. ఇది అందరిని షాక్‌కి గురి చేసింది.

35
తనూజ విషయంలో భార్య చెప్పిన మాటలకు సుమన్‌ శెట్టి క్లారిటీ

ఇదిలా ఉంటే ఇదే ప్రశ్న ఇప్పుడు సుమన్‌ శెట్టికి ఎదురయ్యింది. యాంకర్‌ శివకి ఇచ్చిన ఐడ్రీమ్‌ ఇంటర్వ్యూలో సుమన్‌ శెట్టి దీనికి స్పందిస్తూ, `అది చాలా తప్పుగా పోట్రే అయ్యిందని చెప్పాడు. తను నిజానికి నాతో చెప్పిందేంటంటే? తనూజ వాళ్లు బాగా ఆడుతున్నారు, నువ్వు వాళ్ల కంటే ఇంకా బాగా ఆడండి అని మాత్రమే చెప్పింది. సాధారణంగా మిగిలిన విషయాలకు సబ్‌ టైటిల్స్ లేవు, కానీ ఆ సమయంలో సబ్‌ టైటిల్స్ వేశారు. ఎందుకేశారు?. వినపడలేదని వేశారు, కానీ ఆమె చెప్పింది అది కాదు. మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా ఎఫర్ట్స్‌ పెట్టండి, వాళ్ల కంటే ఇంకా బాగా ఆడాలని చెప్పింది. కానీ దాన్ని రాంగ్‌గా చూపించారు` అని తెలిపారు సుమన్‌ శెట్టి.

45
నా భార్య మూడు రోజులు తినలేదు, కన్నీళ్లు పెట్టుకుంది

`ఇది చాలా బ్యాడ్‌గా బయటకు వెళ్లింది. దీంతో తన వల్ల నాకు బ్యాడ్‌ జరిగిందని, మూడు నాలుగు రోజులు ఏం తినకుండా కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. ఈ విషయాన్ని అమ్మ నాకు చెప్పింది. నా వల్ల ఆయనకు మైనస్‌ అయ్యిందని చాలా ఫీలయ్యింది. నేను బయటకు వచ్చాక ఆమెని ఓదార్చాను. లేదు బంగారం నువ్వు అలా కాదురా, నీ గురించి నాకు తెలియదా? నీ మొగుడిని దించేద్దామని చూస్తావా? అని సర్ధి చెప్పాను. నేను ఇక్కడి వరకు వచ్చానంటే నా భార్య, నా ఫ్యామిలీ, నా అభిమానుల వల్లే, నాకు పీఆర్‌ లేరు. నేను ఆడియెన్స్ ఓట్ల ద్వారానే ఇక్కడి వరకు వచ్చాను. అయితే దీనివల్లే టాప్‌ 5లో ఉండాల్సిన నేను ముందుగానే బయటకు వచ్చానని అంటే దాన్ని నేను ఒప్పుకోను. అది జరిగింది 11వ వారంలో, నేను వచ్చింది 14వ వారంలో, ఆ ప్రభావం ఉంటే, వెంటనే బయటకు రావాలి కదా అని తెలిపారు సుమన్‌ శెట్టి. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

55
సుమన్‌ శెట్టికి బిగ్‌ బాస్‌ అన్యాయం చేశాడా?

మొత్తంగా బిగ్‌ బాస్‌ సుమన్‌ శెట్టిని తప్పుగా చూపించాడని దీన్ని బట్టి అర్థమవుతుంది. నిజానికి అప్పటి వరకు సుమన్‌ శెట్టిపై అందరిలోనూ పాజిటివ్‌ ఒపీనియన్‌ ఉంది. ఆ సమయంలో ఆయన భార్య అలా అనడం ఆశ్చర్యపరిచింది. ఎందుకు ఆమె ఇలా మాట్లాడిందనేది అర్థం కాలేదు. అది కాస్త సుమన్‌ శెట్టికి ఎఫెక్ట్ అయ్యిందనేది నిజం. ఆయనపై ఉన్న పాజిటివిటీ తగ్గింది చెప్పొచ్చు. ఇక ఇప్పుడు బిగ్‌ బాస్‌ షో వల్లే తనకు మంచి ఇమేజ్‌ క్రియేట్‌ అయ్యిందని, ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఇదే కారణమని తెలిపారు సుమన్‌ శెట్టి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories