తన ముందే హీరోయిన్‌తో కొడుకు రోషన్‌ రొమాన్స్.. సిగ్గుతో తట్టుకోలేక యాంకర్‌ సుమ చేసిన పని కేక !

Published : Dec 18, 2023, 10:33 PM ISTUpdated : Dec 18, 2023, 11:12 PM IST

యాంకర్‌ సుమ కనకాల కొడుకు రోషన్‌ ఇటీవల బాగా పాపులర్‌ అయ్యాడు. ఆయన హీరోగా పరిచయం అవుతూ సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు తల్లి ముందే రొమాన్స్ కి దిగడం గమనార్హం. 

PREV
16
తన ముందే హీరోయిన్‌తో కొడుకు రోషన్‌ రొమాన్స్.. సిగ్గుతో తట్టుకోలేక యాంకర్‌ సుమ చేసిన పని కేక !

సుమ కనకాల యాంకర్‌గా సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ యాంకర్‌గా రాణిస్తుంది. ఆమె ఎన్నో షోస్‌ చేసింది. ఇప్పటికీ సినిమా ఈవెంట్లు చేస్తుంది. `సుమ అడ్డా` షోకి హోస్ట్ గా చేస్తుంది. ఇక ప్రస్తుతం ఆమె తన కొడుకు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తుంది. ఆయన హీరోగా `బబుల్‌ గమ్‌` అనే చిత్రం రూపొందుతుంది. ఈ మూవీ ఈ నెల 29న విడుదల కాబోతుంది. 
 

26

చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సుమ అడ్డాకి వచ్చారు `బబుల్‌ గమ్‌` టీమ్‌. సుమ కొడుకు రోషన్‌, హీరోయిన్‌ మానస చౌదరి, దర్శకుడు రవికాంత్‌ పేరపుతోపాటు ఆర్టిస్ట్ కిరణ్‌ మచ్చ, అలాగే రాజీవ్‌ కనకాల ఈ షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా రాజీవ్‌ కనకాల, సుమ మధ్య అనుబంధం అదిరిపోయింది. గులాబీ పువ్వులు తీసుకొచ్చి సుమకి ఇచ్చి తన ప్రేమని తెలియజేశాడు రాజీవ్‌ కనకాల. 
 

36

ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కన్వర్జేషన్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పాట పాడుతూ సుమకి ఆయన ఫ్లవర్స్ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. అంతేకాదు సుమలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆమె అద్భుతమైన నవ్వు అని రాజీవ్‌ చెప్పాడు. దీనికి సుమ స్మైల్‌ ఇవ్వడం అదిరిపోయింది. రాజీవ్‌ మళ్లీ మళ్లీ అదే అనడం మరింత ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌పై వేసిన పంచ్‌లు అలరించాయి. 
 

46

ఇందులో రోషన్‌ రెచ్చిపోయాడు. హీరోయిన్‌తో కలిసి `ఉప్పెన్‌` సినిమాలోని పాటకి రొమాన్స్ స్టార్ట్ చేశాడు. `ఉప్పెన` సినిమాలో `జల జల పారే నీరు.. ` అనే పాట ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఈ పాటకి రష్మి, సుధీర్‌ చేసిన రొమాన్స్ బుల్లితెరపై ఎవర్ గ్రీన్‌ లా నిలిచింది. దాన్ని రోషన్‌, తన హీరోయిన్‌ మానసతో కలిసి రిపీట్‌ చేశాడు. 
 

56

సుమ షోలో సుమ ముందే రోషన్‌, మానసలు ఈ పాటకి రొమాన్స్ చేశారు. పక్కన తండ్రి రాజీవ్‌, మరో పక్కన సుమ ఉన్న లెక్కచేయలేదు. ఒకరి కళ్లల్లోకి మరొకరు చూసుకుంటూ   రెచ్చిపోయారు. రొమాన్స్ ని పీక్‌లోకి తీసుకెళ్లారు. దీంతో అది చూడలేకపోయింది యాంకర్‌ సుమ. తన చీర కొంగుని మోహానికి అడ్డుగా పెట్టుకుంది. అయినా తన వల్ల కాలేదు. 
 

66

దీంతో చేసేదేం లేక డైరెక్ట్ గా వాళ్ల వద్దకే వెళ్లి ఇక ఆపండి అని తెలిపింది. అంతలోనే ఇది షో అంటూ కిరణ్‌ మచ్చ కామెంట్‌ చేయడంతో నవ్వులు విరిసాయి. ఇదంతా సుమ అడ్డా ప్రోమోలోని కంటెంట్‌. తాజాగా విడుదలైన ఈ ప్రోమో వైరల్‌ అవుతుంది. ఈ ఎపిసోడ్‌ ఈ నెల 23న ప్రసారం కానుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories