రాజీవ్‌ కనకాలతో విడిపోలేదు... క్యాష్ వేదిక మీద కంటతడిపెట్టిన సుమ

First Published Sep 8, 2020, 11:07 AM IST

త్వరలో ప్రసారం కానున్న క్యాష్ ప్రొగ్రామ్ ప్రోమో లో సుమ రాజీవ్‌లు కలిసి సందడి చేశారు. బ్రహ్మాజీ, సమీర్‌, రాజా రవీంద్రలు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమం సరదా సరదాగా సాగింది. అయితే ఈ షోలో తమ ప్రేమ బంధాన్ని మరోసారి అభిమానులకు చూపించారు సుమ రాజీవ్‌.

Photo Courtesy: Mallemala Entertainmentsటాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ యాంకర్‌ ఎవరు అంటూ టక్కున గుర్తొచ్చే పేరు సుమ. ప్రస్తుతం టీవీ రియాలిటీ షోస్‌ నుంచి సినీ వేడుకలకు వరకు ఆమె వ్యాఖ్యతగా వ్యవహరిస్తోంది. అదే సమయంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను కూడా నిర్వహిస్తోంది. వృతి పరంగా ఎంతో బిజీగా ఉంటున్న సుమ వ్యక్తిగత జీవితం మీద చాలా వార్తలు వినిపిస్తున్నాయి.
undefined
Photo Courtesy: Mallemala Entertainmentsముఖ్యగాం సినీ నటుడు రాజీవ్‌ కనకాలను పెళ్లాడిన సుమ, కొద్ది రోజులుగా ఆయనతో దూరంగా ఉంటున్నట్టుగా వార్తలు వినిపించాయి. ఒక దశలో వీరిద్దరు వేరు వేరు ఇళ్లలో ఉంటున్నారని, విడాకులు కూడా తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది.
undefined
Photo Courtesy: Mallemala Entertainmentsఅయితే ఈ సమయంలోనే వారి కుటుంబంలో వరుసగా విషాదాలు జరగటం, ఆ సమయంలో వారు కలిసి కనిపించటంతో రూమర్స్‌కు కాస్త బ్రేఖ్ పడింది. కానీ కొద్ది రోజుల తరువాత తిరిగి అవే రూమర్స్ వినిపించాయి. సుమ, రాజీవ్‌ విడిపోయారన్న వార్త మరోసారి తెర మీదకు వచ్చింది.
undefined
Photo Courtesy: Mallemala Entertainmentsఅయితే ఈ వార్తలపై సుమ, రాజీవ్‌లు ఖండించకపోవటం, కనీసం స్పందించకపోవటంతో నిజమేనేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే రూమర్స్‌ అన్నింటిపై ఫైనల్‌గా ఈ జంట క్లారిటీ ఇచ్చింది. రూమర్స్‌కు సమాధానం ఇవ్వకుండానే అన్ని పుకార్లకు చెక్‌ పెట్టారు సుమ, రాజీవ్.
undefined
Photo Courtesy: Mallemala Entertainmentsత్వరలో ప్రసారం కానున్న క్యాష్ ప్రొగ్రామ్ ప్రోమో లో సుమ రాజీవ్‌లు కలిసి సందడి చేశారు. బ్రహ్మాజీ, సమీర్‌, రాజా రవీంద్రలు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమం సరదా సరదాగా సాగింది. అయితే ఈ షోలో తమ ప్రేమ బంధాన్ని మరోసారి అభిమానులకు చూపించారు సుమ రాజీవ్‌.
undefined
Photo Courtesy: Mallemala Entertainmentsపంచ్‌ డైలాగ్‌లతో కామెడీగా సాగిన ఈ ప్రోమోలో చివరగా భర్తను హత్తుకొని భావోధ్వేగానికి లోనైంది సుమ. ఆమె కంటతడి పెట్టుకోవటంతో రాజీవ్ ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. అంతేకాదు సుమను ఎత్తుకొని తిప్పాడు కూడా. దీంతో సుమ, రాజీవ్‌ల బంధంపై వస్తున్న పుకార్లకు తెరపడినట్టైంది.Cash Promo:https:www.youtube.comwatch?v=MkQB8pXPMHE
undefined
click me!