తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

రామ్‌ చరణ్‌ చేత గిన్నెలు తోమిపిచ్చిన సుకుమార్‌.. విషయం తెలియడంతో చిరంజీవి రియాక్షన్‌ ఏంటో తెలుసా?

Aithagoni Raju | Published : Mar 10, 2025 9:18 AM

Ram Charan: రామ్‌ చరణ్‌లో ఉన్న యాక్టింగ్‌ టాలెంట్‌ని బయటపెట్టిన మూవీ `రంగస్థలం`. సుకుమార్‌ రూపొందించిన ఈ మూవీలో చరణ్‌ చేసిన గిన్నెలు తోమే సన్నివేశం గురించి సుకుమార్‌ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.  

15
రామ్‌ చరణ్‌ చేత గిన్నెలు తోమిపిచ్చిన సుకుమార్‌.. విషయం తెలియడంతో చిరంజీవి రియాక్షన్‌ ఏంటో తెలుసా?
chiranjeevi, ram charan, sukumar

Ram Charan: రామ్‌ చరణ్‌ మెగాస్టార్‌ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. `చిరుత` సినిమాతో హీరోగా పరిచయమై ఆకట్టుకున్నాడు. ప్రారంభం నుంచే మాస్‌ హీరోగా ఎస్టాబ్లిష్‌ అయ్యాడు. అయితే నటుడిగా ఆయనపై ప్రారంభంలో విమర్శలు ఉన్నాయి. కానీ `రంగస్థలం` సినిమాతో ఆ రూమర్స్ కి చెక్‌ పెట్టాడు.

చరణ్‌లో మంచి నటుడు ఉన్నాడని నిరూపించాడు. విమర్శకుల చేత ప్రశంసలందుకున్నాడు. అదే సమయంలో `ఆర్‌ఆర్‌ఆర్‌`లోనూ సేమ్‌. రామరాజుగా అదరగొట్టాడు. ఫేస్‌లోనే విభిన్న భావోద్వేగాలను పలికించి వాహ్‌ అనిపించాడు. 
 

25
ram charan, sukumar

అయితే సుకుమార్‌ రూపొందించిన `రంగస్థలం` అప్పట్లో నాన్‌ `బాహుబలి` రికార్డులు బ్రేక్‌ చేసింది. 200 కోట్లకుపైగా వసూళ్లని రాబట్టిన తెలుగు సినిమాగా నిలిచింది. చెవిటి వ్యక్తిగా రామ్‌ చరణ్‌ అద్భుతమైన నటనతో ఇరగదీస్తే, సమంత సైతం అంతే బాగా చేసి మెప్పించింది.

ఇందులో ప్రతి పాత్ర బాగా చేసింది. ప్రతిదీ హైలైట్‌ అయ్యింది. సుకుమార్‌ అలా చేయించుకున్నారు. అయితే ఇందులో రామ్‌ చరణ్‌పై ఓ సీన్‌ ఉన్నాయి. గిన్నెలు తోమడం, టాయిలెట్‌ తీసే సీన్లు ఉన్నాయి. 
 

35
ram charan, sukumar

దీనిపై అప్పట్లో చాలా వరకు చర్చ నడిచింది. రామ్‌ చరణ్‌ లాంటి స్టార్‌ హీరోచేత ఇలాంటి పనులు చేయించాడా సుకుమారు? అని అన్నారు. ఫ్యాన్స్ నుంచి కొంత అసంతృప్తి కూడా వ్యక్తమయ్యింది.

కానీ చరణ్‌ తాను చేస్తానని ఎలాంటి జిమ్మిక్కులు అవసరం లేదని, తానే స్వయంగా చేశాడట. అయితే ఈ విషయం చిరంజీవికి తెలిసింది. మరి ఆయన ఏం చేశాడనేది క్రేజీ. ఆయన రియాక్షన్‌ వాహ్‌ అనిపిస్తుంది.

read  more: 'రాజాసాబ్': ఫైనాన్సియల్ సమస్యలతో షూటింగ్ ఆపారా?
 

45
ram charan

ఓ ఇంటర్వ్యూలో సుకుమార్‌కి ఈ ప్రశ్న ఎదురయ్యింది. ఇలాంటి సీన్‌కి రామ్‌ చరణ్‌ని ఎలా ఒప్పించారు, ఎలా చేయించారు? అని, దానికి సుకుమార్‌ స్పందిస్తూ, ఆ క్రెడిట్‌ మొత్తం రామ్‌ చరణ్‌ దే అన్నారు. తాను రోజూ ఇంట్లో గిన్నెలు తోమే అలవాటు ఉన్నట్టుగా ఆ సీన్ లో చేశాడని, చాలా అనుభవం ఉన్న వ్యక్తిలాగా, బాగా పాత్రలో ఇన్‌వాల్వ్ అయి చేశాడని, అందుకే అది అంత సహజంగా వచ్చిందని తెలిపారు సుకుమార్‌.

రామ్‌ చరణ్‌ అంత అహర్నిశలు కష్టపడ్డాడు, అంతటి డౌన్‌ టూ ఎర్త్ లో ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం అది అని, చరణ్‌ అది చేస్తుంటా తామే షాక్‌ అయినట్టు తెలిపారు సుకుమార్‌. 

55
chiranjeevi

చిరంజీవి ఈ సీన్‌ చూసి తనని అడిగాడట. ఈ సీన్‌ నువ్వే చేసి చూపించావ్‌ కదా అని అడిగితే, లేదు సార్‌, తాను చెప్పలేదు, చరణే పాత్రని అంతగా ఓన్‌ చేసుకున్నాడు, అందుకే అలా చేశాడని తెలిపారట. అయినా చిరంజీవి నమ్మలేదట.

కానీ అదే నిజం అని, అంతే బాగా వంట కూడా చేశాడు, వంట చేసేటప్పుడు రుచి చూసేసీన్‌ కూడా సహజంగా చేశాడని, అది నమ్మలేకపోయామని తెలిపారు సుకుమార్‌. పాత్రలో జీవించినప్పుడు, అలాంటి సీన్లని చూసినప్పుడు వాటిని మైండ్‌లో ప్రింట్‌ చేసుకున్నప్పుడు ఇలా సహజంగా చేయగలుగుతారని,చరణ్‌ అది చేశాడని, చిరంజీవిని కూడా సర్‌ప్రైజ్‌ చేశాడని తెలిపారు సుకుమార్‌. 

read  more: రాజశేఖర్‌ నో చెప్పిన సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన చిరంజీవి, ఆ మూవీ ఏంటో తెలుసా? రెండు సార్లు సేమ్‌

also read: ఎంగేజ్‌మెంట్‌తో నటి అభినయ రూమర్లకి చెక్‌.. ఆమె కాబోయే భర్త ఎవరు? పోస్ట్ వైరల్‌
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!
Recommended Photos