సుడిగాలి సుధీర్‌ హీరోగా చేసి ఇప్పుడు గొడుగు పట్టుకునే అసిస్టెంట్‌ లెవల్‌కి పడిపోయాడా.. రష్మి సెల్ఫీతో బట్టబయలు

Published : Feb 01, 2022, 06:14 PM IST

సుడిగాలి సుధీర్‌.. టీవీ రంగంలో అత్యంత క్రేజ్‌, పాపులారిటీ ఉన్న కమెడీయన్‌. `జబర్దస్త్`లో ఆయన చేసే రచ్చ అంతా ఇంతా కాదు. స్టార్‌ కమెడీయన్‌ నుంచి హీరోగానూ తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. 

PREV
17
సుడిగాలి సుధీర్‌ హీరోగా చేసి ఇప్పుడు గొడుగు పట్టుకునే అసిస్టెంట్‌ లెవల్‌కి పడిపోయాడా.. రష్మి సెల్ఫీతో బట్టబయలు

సుడిగాలి సుధీర్‌.. `జబర్దస్త్` తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌తోపాటు బుల్లితెర స్టార్‌గానూ ఎదిగారు. టీవీ రంగంలో అత్యంత బిజీ యాక్టర్‌గా మారిన సుధీర్‌.. `ఢీ` షోలో మొన్నటి వరకు సందడి చేశారు. అలాగే `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోకి హోస్ట్ గానూ చేస్తున్నారు. అన్ని షోలను రక్తికట్టిస్తున్నారు. ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ షోలు సక్సెస్‌ కావడంలో సుధీర్‌ పాత్ర కీలకంగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

27

ఇదిలాఉంటే ఇటీవల ఆయన సినిమాల్లో బిజీ అయ్యారు. హీరోగా అవకాశాలొస్తున్నాయి. మూడేళ్ల క్రితం `సాఫ్ట్ వేర్‌ సుధీర్‌`తో హీరోగా ఆయన చేసిన ప్రయత్నం సక్సెస్‌ అయ్యింది. ఆ తర్వాత `త్రిమంకీస్‌` పేరుతో గెటప్‌ శ్రీను, ఆటో రాంప్రసాద్‌లతో కలిసి నటించారు. ఇప్పుడు `సాఫ్ట్ వేర్‌ సుధీర్‌` కాంబినేషన్‌లోనే `గాలోడు` అనే సినిమా చేస్తున్నారు సుధీర్‌. దీంతోపాటు మరికొన్ని సినిమా అవకాశాలు ఆయన జాబితాలో ఉన్నాయి. ఇక సినిమాల్లో బిజీ అవుతున్న నేపథ్యంలో సుధీర్‌ ఇటీవల `ఢీ` షో నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సినిమాలపై ఫోకస్‌ పెట్టాడు. కెరీర్‌ పరంగా నెక్ట్స్ లెవల్‌కి రీచ్‌ అవుతున్నారు. 

37

ఈ క్రమంలో సుధీర్‌ గురించిన ఓ వార్త షాక్‌కి గురి చేస్తుంది. సినిమాల్లో హీరోగా చేస్తున్న సుధీర్‌ ఇప్పుడు ఏకంగా అసిస్టెంట్‌గా పడిపోయాడట. హీరోకి అసిస్టెంట్‌ స్థాయికి పడిపోయాడని తెలుస్తుంది. గొడుగు పట్టుకుని మరీ అసిస్టెంట్గా కనిపించడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి, షాక్‌కి గురి చేస్తుంది. మరి ఆ కథేంటో చూస్తే.. సుడిగాలి సుధీర్‌ ఎప్పటిలాగే (ఎక్స్ ట్రా) `జబర్దస్త్` తనదైన స్కిట్‌తో సందడి చేశారని తెలుస్తుంది. లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో సుధీర్‌ గొడుగు పట్టుకుని హీరోగా చేస్తున్న బాబుకి అసిస్టెంట్‌గా కనిపించడం విశేషం. షాట్‌ ధరించి, కాస్త చిరిగిన టీ షర్ట్ లో, కొత్త హెయిర్‌ స్టయిల్‌తో కనిపించారు సుధీర్‌. సినిమాల్లో హీరోగా చేసి చివరికి ఇలా అసిస్టెంట్‌గా మారిపోయాడట. ఈ విషయాన్ని నరేష్‌ ప్రస్తావిస్తూ హేళన చేయడం గమనార్హం. 

47

కమెడీయన్‌ బాబు తానకు హీరోగా ఆఫర్‌ వచ్చిందని, చేయమంటావా నరేష్‌ అని అడగ్గా.. వద్దురా.. చేస్తే వీడిలా అయిపోతావని సుడిగాలి సుధీర్‌ని చూపిస్తూ నరేష్‌ చెప్పడంతో అసలు బండారం బయటపడినట్టయ్యింది. సుధీర్‌ హీరోగా రాణిస్తానని, చెప్పి చివరికి ఇలా హీరో నుంచి అసిస్టెంట్‌ స్థాయికి పడిపోయాడా? అనే లెవల్‌లో వీరి స్కిట్‌ని ప్రదర్శించినట్టు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

57

అంతేకాదు తాను హీరోగా రాణించే సమయంలో కనీసం సెల్ఫీలు కూడా ఇవ్వలేదని, బర్త్ డేలకు విషెస్‌ కూడా చెప్పలేదని ఆరోపిస్తూ హీరోగా నటించిన బాబు.. సుధీర్‌పై విరుచుకుపడ్డారు. ఆయన్ని కొడుతూ చుక్కలు చూపించారు. దీంతో సుధీర్‌ పారిపోయే పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. 

67

ఇంత జరుగుతుండగా, ఏకంగా యాంకర్‌ రష్మి నిప్పుపై ఉప్పు పోసినట్టు.. ఆమె స్టేజ్‌పైకి వచ్చి సుధీర్‌తో సెల్ఫీ తీసుకోవడం విశేషం. ఇందులోనూ తన మార్క్‌ కామెడీ యాక్షన్‌తో నవ్వులు పూయించాడు సుధీర్‌. ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం కామెడీని పండించిందని, హైలైట్‌గా నిలుస్తుందని అర్థమవుతుంది. 

77

ఇక సుధీర్‌, రష్మి షో ప్రారంభం నుంచి క్లోజ్‌గా మూవ్‌ అవుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి చాలా సార్లు స్టేజ్‌పై పెళ్లిళ్లు కూడా చేశారు మల్లెమాల నిర్వహకులు. అనేక సార్లు డ్యూయెట్లు పాడుకున్నారు. రొమాంటిక్‌ సాంగ్స్‌ లో రెచ్చిపోయి కెమిస్ట్రీని పండించారు. దీంతో అంతా వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే టాక్‌ కూడా వినిపించింది. కానీ తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే వీరిద్దరు నిజ జీవితంలోనూ మ్యారేజ్‌ చేసుకుంటే, కలిసుంటే చూడాలని వారిద్దరి అభిమానులు కోరుకుంటుండటం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories