ఈ హీరోలకు తొలిప్రయత్నమే.. చేదు అనుభవం!

First Published Aug 2, 2019, 11:56 AM IST

ఏ ఇండస్ట్రీలోనైనా వారసత్వం అనేది కామన్ అయిపోయింది. బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోలుగా కొనసాగుతున్న నటులు చాలా మంది ఉన్నారు. 

ఏ ఇండస్ట్రీలోనైనా వారసత్వం అనేది కామన్ అయిపోయింది. బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోలుగా కొనసాగుతున్న నటులు చాలా మంది ఉన్నారు. అలానే ఫెయిల్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. ఏ హీరో ఫ్యూచర్ అయినా డిసైడ్ చేయాల్సింది బాక్సాఫీస్ మాత్రమే.. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు వారసత్వ హీరోలకంటే టాలెంట్ ఉన్న వారికే సపోర్ట్ చేస్తున్నారు. కొత్త వారితో పోల్చుకుంటే స్టార్ ఫ్యామిలీల నుండి వచ్చిన హీరోలు మాత్రం కాస్త డల్ అవుతున్నారు. అయితే అలా హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది డెబ్యూ ఫిలిమ్స్ ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి. ఆ సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!
undefined
ప్రభాస్ - రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్ ఇప్పుడు 'బాహుబలి' లాంటి సినిమాతో స్టార్ అయ్యాడు. కానీ ఈ హీరో నటించిన మొదటి సినిమా 'ఈశ్వర్' మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.
undefined
పవన్ కళ్యాణ్ - ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజే వేరు. మెగాస్టార్ బ్రదర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ నటించిన మొదటి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈ సినిమా ఫ్లాప్ అయింది.
undefined
జూనియర్ ఎన్టీఆర్ - నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేశాడు. ఆ తరువాత పూర్తిస్థాయి హీరోగా 'నిన్ను చూడాలని' అనే సినిమాతో పరిచయమయ్యాడు. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.
undefined
నాగచైతన్య - నాగర్జున నటవారసుడిగా 'జోష్' సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కూడా ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది
undefined
సుధీర్ బాబు - సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు 'ఎస్ ఎం ఎస్' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇప్పుడు హీరోగా సక్సెస్ లు అందుకుంటున్నప్పటికీ అతడి మొదటి సినిమా మాత్రం పెద్ద ఫ్లాప్.
undefined
వరుణ్ తేజ్ - పూర్తిస్థాయిలో నెగెటివ్ టాక్ రాకపోయినా.. వరుణ్ తేజ్ నటించిన డెబ్యూ ఫిలిం 'ముకుందా'కి హిట్ టాక్ అయితే లేదు.
undefined
మంచు విష్ణు - కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మంచు విష్ణు హీరోగా తనను తాను నిలదొక్కుకోలేకపోతున్నాడు. అతడు నటించిన డెబ్యూ ఫిలిం 'విష్ణు' కూడా పెద్ద ఫ్లాప్.
undefined
సుమంత్ అశ్విన్ - ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు కుమారుడే ఈ సుమంత్. 'తూనీగ తూనీగ' సినిమాతో సుమంత్ అశ్విన్ హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాను ఎంఎస్ రాజు స్వయంగా డైరెక్ట్ చేశారు. ఎంతో మంది హీరోలకు బ్రేక్ ఇచ్చిన రాజు తన కొడుకుకి మాత్రం బ్రేక్ ఇవ్వలేకపోయాడు.
undefined
అక్కినేని అఖిల్ - భారీ అంచనాల మధ్య అఖిల్ నటించిన తొలి సినిమా 'అఖిల్' విడుదలైంది. రిలీజ్ కి ముందు సినిమాపై ఎంత హైప్ ఏర్పడిందో సినిమా అంత పెద్ద ఫ్లాప్ అయింది.
undefined
అల్లు శిరీష్ - మెగాఫ్యామిలీ నుండి వచ్చిన అల్లు శిరీష్ 'గౌరవం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.
undefined
కళ్యాణ్ దేవ్ - చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ 'విజేత' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలిపోయింది.
undefined
కళ్యాణ్ రామ్ - 'తొలి చూపులోనే' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పెద్ద ఫ్లాప్ చవిచూశాడు.
undefined
సుశాంత్ - అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ హీరో 'కాళిదాసు' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ మొదటి సినిమానే దెబ్బ కొట్టింది.
undefined
click me!