ఇప్పుడు మరోసారి తన ఘాటు రేపే అందాలను పంచుకుని అలరిస్తుంది. రకుల్ పూర్తిగా బాలీవుడ్‌కి పరిమితయ్యింది. ఆమె టాలీవుడ్ వైపు చూడటమే మర్చిపోయింది. అయితే ఇంతటి స్టార్ ఇమేజ్, సక్సెస్ తెచ్చింది మాత్రం టాలీవుడ్ అనే చెప్పాలి. ఇక్కడ ఆమె టాప్ స్టార్లందరితోనూ కలిసి నటించింది. నాగార్జునతో సహా మహేష్, ఎన్టీఆర్, బన్నీ, రామ్‌చరణ్, గోపీచంద్, రవితేజ, రామ్, ఆది సాయికుమార్, సందీప్ కిషణ్ వరకు అందరు హీరోలతో కలిసి నటించి మెప్పించింది.కానీ ఇప్పుడు ఆ టాలీవుడ్‌నే లైట్ తీసుకోవడం గమనార్హం.