త్రిషకి లిప్‌ లాక్‌ పెట్టేందుకు వెనకాడిన స్టార్‌ హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

స్టార్‌ హీరోయిన్‌ త్రిష.. ముద్దు సీన్లకి, రొమాంటిక్‌ సీన్లకి దూరంగా ఉంటుంది. కానీ ఓ సినిమా కోసం ఆమె ఓకే చెప్పింది. కానీ స్టార్‌ హీరో మాత్రం ఆమెకి ముద్దు పెట్టేందుకు సంకోచించాడట. 
 

star hero unable to dare lip lock to trisha here the shocking truth arj

త్రిష.. ఒకప్పుడు టాలీవుడ్‌లో బాగా మెరిసింది. స్టార్‌ హీరోలతో కలిసి నటించింది. బిజీ హీరోయిన్ గా నిలిచింది. కానీ అనూహ్యంగా ఆమె టాలీవుడ్‌లో సినిమాలు తగ్గించింది. తెలుగులోనే కాదు తమిళంలోనూ తక్కువగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఇటీవల `పొన్నియిన్‌ సెల్వన్‌`తో మరోసారి బిజీ అయ్యింది. ఓ వైపు తమిళం, మరోవైపు తెలుగులోనూ సినిమాలు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుంది. మళ్లీ బిజీ అవుతుందీ బ్యూటీ. 
 

star hero unable to dare lip lock to trisha here the shocking truth arj

ఇదిలా ఉంటే త్రిష మొదట్నుంచి రొమాంటిక్‌ సీన్లు, ముద్దు సీన్లు వంటి వాటికి దూరంగా ఉండేది. ఒకటి అర తప్పితే పెద్దగా ఆమె ఇలాంటి వాటిని ఎంకరేజ్‌ చేసింది లేదు. కానీ ఆమె నటించిన రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ `96` చిత్రంలో మాత్రం ఓకే చెప్పింది. ఆ సినిమాలో హీరోగా విజయ్‌ సేతుపతి నటించిన విషయం తెలిసిందే. తమిళంలో పెద్ద హిట్‌ అయిన ఈ మూవీలో లిప్‌ లాక్‌ సీన్‌ ఉంది. క్లైమాక్స్ లో హీరోహీరోయిన్లు విడిపోయే సమయంలో లిప్‌ లాక్‌ పెట్టుకోవాల్సి ఉంది. స్క్రిప్ట్ లో దర్శకుడు అలానే రాసుకున్నాడు. అందుకు త్రిష కూడా ఓకే చెప్పింది. 
 


ఇక క్లైమాక్స్ లో ఎయిర్‌పోర్ట్ వద్ద త్రిష, విజయ్‌ సేతుపతి కలుసుకుంటారు. ఒకరినొకరు విడిపోవాల్సి రావడం, విజయ్‌ సేతుపతిని వదిలి త్రిష వెళ్లిపోవాల్సి వస్తుంది. దీంతో ఆ ఫీలింగ్‌ని భరించ లేక త్రిష విజయ్‌సేతుపతి వద్దకి వచ్చి హగ్‌ చేసుకుంటుంది. కానీ ముద్దు పెట్టుకోదు. కేవలం హీరో తలని పట్టుకుంటుంది. హీరో కూడా ఆమెని పట్టుకుంటాడు. అయితే ఆ సమయంలో త్రిషకి లిప్‌ లాక్‌ ఇచ్చేందుకు విజయ్‌ సేతుపతి సంకోచించాడట. ఆయన ముద్దు సీన్లకి దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే. దీంతో ఆ సీన్‌ చేయాల్సి ఉన్నా, చేయలేకపోయారట. 
 

చివరి నిమిషంలో విజయ్‌ సేతుపతి అంతటి సాహసం చేయలేకపోవడంతో ఆ సీన్‌ లేకుండానే ముగించారు. అయితే దాన్ని ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని అంతకంటే బలమైన ఫీల్‌ని కలిగించేలా యాక్ట్ చేయడం విశేషం. జస్ట్ ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడంలోనే రొమాన్స్ ని పలికించి బెస్ట్ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా ఆ చిత్రాన్ని మార్చేశారు. వారిద్దరి కెరీర్‌లోనే మైలు రాయి చిత్రంగా `96` మిగిలిపోతుంది. అంతేకాదు రొమాంటిక్‌ లవ్ స్టోరీస్‌లోనే బెస్ట్ మూవీగా ఇది నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆ ఫీల్‌ తెలుగులో వర్కౌట్‌ కాలేదు. ఇక్కడ సమంత, శర్వానంద్‌ కలిసి నటించారు. `జాను` పేరుతో రూపొందించారు. కానీ సక్సెస్‌ కాలేదు. 
 

ఇక త్రిష ఇప్పుడు హీరోయిన్‌గా బిజీ అవుతుంది. ఆమె ఇప్పుడు దళపతి విజయ్‌తో `లియో` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా దసరాకి విడుదల కాబోతుంది. మరోవైపు తెలుగులో చిరంజీవితో కళ్యాణ్‌ కృష్ణ చిత్రంలో నటించబోతుందని సమాచారం. ఇంకోవైపు విజయ్‌ సేతుపతి హీరోగా, విలన్‌గా బిజీగా ఉన్నారు. ఇటీవల వచ్చిన `జవాన్‌`లో విలన్‌గా మెప్పించిన విషయం తెలిసిందే. 

Latest Videos

vuukle one pixel image
click me!