షర్ట్ బటన్ తీసి యాంకర్ రష్మీ బోల్డ్ ట్రీట్... జబర్దస్త్ యాంకర్ గ్లామర్ కి నెటిజెన్స్ షేక్!

Published : Sep 29, 2023, 06:58 PM IST

మరో గ్లామరస్ ఫోటో షూట్ తో ఫ్యాన్స్ ని పలకరించింది రష్మీ గౌతమ్. షర్ట్ బటన్ తీసి బోల్డ్ అవతార్ లో మైండ్ బ్లాక్ చేసింది. రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.   

PREV
16
షర్ట్ బటన్ తీసి యాంకర్ రష్మీ బోల్డ్ ట్రీట్... జబర్దస్త్ యాంకర్ గ్లామర్ కి నెటిజెన్స్ షేక్!
Rashmi Gautam

హీరోయిన్ గా రష్మీ కెరీర్ నెమ్మదించింది.ఇటీవల భోళా శంకర్, బాయ్స్ హాస్టల్ చిత్రాల్లో ఆమె మెరిసింది.   వరుస ప్లాప్స్ ప్రతికూల ప్రభావం చూపాయి. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్.  ఏళ్ల తరబడి విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని గత ఏడాది విడుదల చేశారు. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ కమర్షియల్ గా ఆడలేదు. 


 

26
Rashmi Gautam

రష్మీ లీడ్ హీరోయిన్ గా ఆఫర్స్ ఆగిపోయాయి. దీంతో ఆమె పూర్తి దృష్టి బుల్లితెర మీద పెట్టారు.అక్కడ దూసుకుపోతుంది. పదేళ్లుగా రాణిస్తున్న రష్మీ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ కొన్నారు. ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆమె సంపాదన కోట్లకు చేరింది. మల్లెమాల సంస్థలో సందడి మొత్తం రష్మీదే.  ఈటీవీలో ఆమె హవా నడుస్తుంది. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అనసూయ లేని లోటు రష్మీ  భర్తీ చేస్తుంది. 

36
Rashmi Gautam

కాగా కొత్త యాంకర్ రావడంతో  జబర్దస్త్ షో చేజారింది. అనసూయ స్థానంలో సౌమ్యరావు అనే కన్నడ సీరియల్ నటి  వచ్చారు. అయితే పండుగలకు, పబ్బాలకు మల్లెమాల రూపొందించే స్పెషల్ ఈవెంట్స్ లో రష్మీ సందడి చేస్తున్నారు. యాంకర్ గా ఆమెకు తిరుగులేదని చెప్పాలి. 
 

46
Rashmi Gautam

ఓ దశలో రష్మీ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేశారు. ఆమె నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. దీంతో మెల్లగా రష్మీకి ఆఫర్స్ తగ్గాయి. ఒక నిర్మాతతో రష్మీ గొడవపడ్డారని కూడా సమాచారం. ఆ వివాదం ఆమె కెరీర్ పై నెగిటివ్ ప్రభావం చూపింది.

 

56
Rashmi Gautam

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... రష్మీ కెరీర్ మొదలైంది నటిగానే. బిగినింగ్ లో ఆమె చిన్న చిన్న పాత్రలు చేశారు. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో యాంకర్ గా మారారు. జబర్దస్త్ ప్రారంభంలో యాంకర్ గా వ్యవహరించిన అనసూయ వ్యక్తిగత కారణాలతో షో నుండి తప్పుకున్నారు. దాంతో రష్మీకి ఛాన్స్ దక్కింది. జబర్దస్త్ ఛాన్స్ రష్మీ దశ మార్చేసింది. 

66
Rashmi Gautam

ఇక రష్మీ పెళ్లి ఎప్పుడనేది ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ గా ఉంది. దానికి ఇంకా సమయం ఉందని ఆమె చెప్పుకొస్తున్నారు. చెప్పాలంటే ఇప్పటికే రష్మిక ఏజ్ బార్ బ్యాచ్ లర్స్ లిస్ట్ లో చేరిపోయింది. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ని రష్మీ ప్రేమిస్తున్నారనే వాదన చాలా కాలంగా ఉంది. ఆన్ స్క్రీన్ లో నాన్ స్టాప్ రొమాన్స్  కురిపించిన నేపథ్యంలో రష్మీ, సుధీర్ నిజమైన ప్రేమికులే అని పలువురు నమ్ముతున్నారు. రష్మీ, సుధీర్ మాత్రం అది బుల్లితెర వరకే, ఆఫ్ స్క్రీన్ లో మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories