పట్టు చీర కట్టి, కళ్ళకు కాటుక పెట్టి చక్కగా ముస్తాబైన అనసూయ... స్టార్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

First Published Dec 9, 2023, 12:33 PM IST

అనసూయ పట్టు చీరలో ముగ్ద మనోహరంగా తయారైంది. కళ్ళకు కాటుక పెట్టి, పెదవులకు లిప్స్టిక్ వేసి అద్దం ముందు నిల్చొని మురిసిపోయింది అనసూయ. ఆమె లేటెస్ట్ గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది. 
 

Anasuya bharadwaj

అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. నటిగా అనసూయ వరుస చిత్రాలు చేస్తున్నారు. ఈ ఏడాది అనసూయ నటించిన మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాలు విడుదలయ్యాయి. 
 

Anasuya bharadwaj

జయాపజయాలతో సంబంధం లేకుండా అనసూయకు ఆఫర్స్ దక్కుతుంది. కథలో కీలకమైన రోల్స్ లో ఆమె కనిపిస్తున్నారు. అనసూయ తన అభిమానులను అంతకంతకూ పెంచుకుంటుంది. 

Latest Videos


Anasuya bharadwaj

వచ్చే ఏడాది పుష్ప 2లో అనసూయ దాక్షాయణిగా డీగ్లామర్ రోల్ లో అలరించనుంది. విలన్ సునీల్ భార్యగా అనసూయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసింది. 

Anasuya bharadwaj

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. 

Anasuya bharadwaj

ఇక అనసూయ కెరీర్లో సెటిల్ అయ్యింది. ఆమె సంపాదన కోట్లకు చేరింది. హైదరాబాద్ లో లగ్జరీ హౌస్లో అనసూయ నివాసం ఉంటుంది. 

Anasuya bharadwaj

అనసూయ కెరీర్ పరిశీలిస్తే... జబర్దస్త్ షోతో అనసూయ వెలుగులోకి వచ్చింది. ఈ లెజెండరీ కామెడీ షోతో అనసూయ గ్లామరస్ యాంకర్ గా పాప్యులర్ అయ్యారు. 

Anasuya bharadwaj

ఏళ్ల తరబడి జబర్దస్త్ లో ఆమె ప్రయాణం సాగింది. సదరు షోలో అనసూయ డ్రెస్సింగ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా అనసూయ తగ్గింది లేదు. విమర్శించిన వాళ్లకు ఘాటైన సమాధానం చెప్పింది. 
 

Anasuya bharadwaj

గత ఏడాది అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని తేల్చి చెప్పింది. టీఆర్పీ కోసం మేకర్స్ చెత్త స్టంట్స్ నాకు నచ్చడం లేదని ఓ సందర్భంలో ఓపెన్ అయ్యింది. 

Anasuya bharadwaj

ఈ క్రమంలో బుల్లితెర ఆడియన్స్ అనసూయను మిస్ అవుతున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా అనసూయ అందుబాటులో ఉంటున్నారు. 

Anasuya bharadwaj

అనసూయ ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రతి విషయం తన అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఓ ఈవెంట్ కి సిద్ధం అవుతున్న ఫోటోలు తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అవి వైరల్ అవుతున్నాయి... 
 

click me!