మన హీరోల్లో మంచి రచయితలు కూడా ఉన్నారు

First Published Aug 17, 2019, 6:26 PM IST

సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకుండా వారికంటూ ఒక ప్రత్యేక ఉండాలి. గత కొన్నేళ్ల నుంచి చూసుకుంటే స్టార్ హీరోల్లో చాలా మార్పులు వచ్చాయి. అయితే వారిలో రైటర్స్ కూడా ఉన్నారు. కానీ అంత తొందరగా బయటపడరు. అయితే కొంత మంది సొంతంగా సినిమా కథలను రాసుకొని సెట్స్ పైకి తీసుకెళ్లి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారిపై ఓ లుక్కేద్దాం. 

అడివి శేష్: రీసెంట్ గా ఎవరు సినిమాతో రైటర్ గా తన టాలెంట్ మొత్తాన్ని నిరూపించుకున్నాడు. క్షణం - గూఢచారి సినిమాలకు కూడా రైటర్ గా ఉన్న శేష్ మంచి సక్సెస్ లు అందుకున్నాడు.
undefined
విశ్వక్ సేన్: ఈ నగరానికి ఏమైంది సినిమాతో హీరోగా పరిచయమైన విశ్వక్ తన సెకండ్ మూవీ ఫలక్ నుమా దాస్ స్వీయా దర్శకత్వంలో తెరకెక్కించి మంచి స్క్రీన్ ప్లే సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ కథను రాసే పనిలో ఉన్నాడు.
undefined
కమల్ హాసన్: చాలా సార్లు కథ రచయితగా తానేంటో నిరూపించుకున్నాడు ఈ లోక నాయకుడు ముఖ్యంగా విశ్వరూపం సినిమాతో కమల్ కు మంచి గుర్తింపు దక్కింది.
undefined
ఉపేంద్ర: ఈ కన్నడ స్టార్ హీరో సూపర్ - రా ఉపేంద్ర వంటి ఎన్నో డిఫరెంట్ సినిమాలకు సొంతంగా కథలను రాసుకొని క్లిక్కయ్యాడు.
undefined
ధనుష్: పలు సినిమాలకు రైటర్ గానే కాకుండా డైరెక్షన్ లోను బెస్ట్ అనిపించుకున్నాడు. విఐపి 2 సినిమాకు కూడా ధనుష్ సొంతంగా కథ రాసుకున్నాడు.
undefined
శ్రీనివాస్ అవసరాల: నటుడిగా కొనసాగుతున్న శ్రీనివాస్ లో కూడా మంచి రచయిత ఉన్నాడని ఊహలు గుసగుస లాడే సినిమాతో నిరూపించాడు. దర్శకుడిగా కూడా ఈ నటుడు మంచి ప్రయత్నాలే చేస్తున్నాడు.
undefined
పవన్ కళ్యాణ్: రాజకీయాల్లో ఉండి సినిమాలను కాస్త దూరం పెట్టిన పవన్ కళ్యాణ్ లో మంచి రచయిత ఉన్నాడు. జానీ సినిమాను డైరెక్ట్ చేసిన పవన్ సొంతంగా కథను రాసుకున్నాడు. ఆ తరువాత గుడుంబా శంకర్ కు స్క్రీన్ ప్లే అందించాడు. చివరగా సర్దార్ గబ్బర్ సింగ్ కథను కూడా పవర్ స్టార్ సొంతంగా రాసుకున్నాడు.
undefined
ప్రకాష్ రాజ్: నటుడిగా ఎన్నో అవార్డులను అందుకున్న ప్రకాష్ రాజ్ ధోని నాటౌట్ అనే సినిమాను తనదైన స్క్రీన్ ప్లే ను రాసి తెరకెక్కించి అందరిని ఆకట్టుకున్నారు.
undefined
నాని: హీరోగా పరిచయం కాకముందు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసిన నాని కొన్ని కథలను కూడా రాసుకున్నాడు. బన్నీ కోసమని స్పెషల్ గా స్టోరీ రాసుకున్నాడు. కానీ తన టాలెంట్ బయటపెట్టడానికి ఇంకా సమయాం ఉందని అంటున్నాడు.
undefined
రవితేజ: యాక్టర్ కాకముందు ఈ హీరో కూడా రైటర్ గా చాలానే స్క్రిప్ట్ లు రెడీ చేసుకున్నారు. హీరోగా సెట్టయిన తరువాత తన పాత పనిని మర్చిపోయాడు. భవిష్యత్ లో తన రైటింగ్ స్కిల్స్ ని ఏమైనా బయటపెడతాడేమో చూడాలి.
undefined
click me!