SS Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి, ఆస్కార్ విజేత కీరవాణి కాంబినేషన్‌లో వచ్చి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సాంగ్స్ చాలానే ఉన్నాయి. ఇప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న టాప్ సాంగ్స్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
కీరవాణి జక్కన్న సినిమాల్లో థియేటర్లను షేక్ చేసిన సాంగ్స్ ఇవే
భారతీయ సినిమా హిస్టరీలో ఎస్ ఎస్ రాజమౌళి, ఎమ్ ఎమ్ కీరవాణిల జోడీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఇద్దరు టాలెంటెడ్ కజిన్స్ కలిశారంటే చాలు, బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావాల్సిందే. రాజమౌళి తీసిన ప్రతి సినిమాకు కీరవాణినే సంగీతం అందించారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన పాటలు ఇప్పటికీ ఎంతోమంది ఫేవరెట్‌గా నిలిచాయి. రాజమౌళి సినిమాల్లో ఎమ్ ఎమ్ కీరవాణి కంపోజ్ చేసిన కొన్ని మైండ్ బ్లోయింగ్, ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ వివరాలు గమనిస్తే..
26
ప్రపంచాన్ని ఊపేసిన నాటు నాటు సాంగ్
రాజమౌళి, కీరవాణిల బెస్ట్ సాంగ్స్ లిస్ట్ గురించి మాట్లాడుకుంటే అందరికీ మొదట గుర్తొచ్చేది 'నాటు నాటు' సాంగే. ఈ పాట ఏకంగా ఆస్కార్ అవార్డును గెలుచుకుని గ్లోబల్ సెన్సేషన్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ లవర్స్ ఈ పాటలోని ఐకానిక్ స్టెప్స్‌ను రీక్రియేట్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడిన ఈ పాటలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో థియేటర్లలో రచ్చ లేపారు. కీరవాణి అందించిన బీట్స్ ఇప్పటికీ వింటే ఎవరికైనా పూనకాలు రావాల్సిందే.
36
ధీర ధీర.. బంగారు కోడి పెట్ట తో దుమ్ములేసింది
మగధీర సినిమాలో ధీర ధీర పాట ఒక అద్భుతమని చెప్పాలి. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ సాంగ్ విజువల్స్ పరంగానే కాకుండా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పరంగానూ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఈ పాటను నికితా నిగమ్, ఎమ్ ఎమ్ కీరవాణి కలిసి పాడారు. ఇక ఇదే సినిమాలో వచ్చిన బంగారు కోడి పెట్ట రీమిక్స్ సాంగ్ ఇప్పటికీ టాలీవుడ్‌లో ఒక క్రేజీ డ్యాన్స్ నంబర్. రంజిత్, శివాని పాడిన ఈ పాట హై ఎనర్జీ వైబ్‌తో అప్పట్లో థియేటర్లను షేక్ చేసింది.
బాహుబలి: ది బిగినింగ్ సినిమాలోని ధీవర సాంగ్ సినిమా గ్రాండియర్‌ను, ఎమోషన్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. రమ్య బెహరా, దీపు పాడిన ఈ పవర్‌ఫుల్ కంపోజిషన్‌లో వెస్ట్రన్ ఆర్కెస్ట్రా, మోడరన్ మ్యూజికల్ ఎలిమెంట్స్ చాలా పర్ఫెక్ట్‌గా మిక్స్ అయ్యాయి. ఇక బాహుబలి 2: ది కన్క్లూజన్ విషయానికి వస్తే, యాక్షన్ సీన్ల మధ్యలో వచ్చే కన్నా నిదురించరా పాట ఒక ప్రశాంతతను ఇస్తుంది. శ్రీనిధి, వి. శ్రీసౌమ్య పాడిన ఈ జోలపాట లాంటి సాంగ్.. ప్రేమ, రక్షణ అనే ఎమోషన్స్‌ను చాలా బ్యూటిఫుల్‌గా చూపించింది.
56
నే నే నాని నే.. ఈగ ఫీవర్
రాజమౌళి కెరీర్‌లోనే అత్యంత వైవిధ్యమైన రొమాంటిక్ సాంగ్స్‌లో ఈగ సినిమాలోని నే నే నాని నే ఒకటి. ఒక ఫాంటసీ స్టోరీకి లవ్ ఎలిమెంట్‌ను పర్ఫెక్ట్‌గా కనెక్ట్ చేయడంలో ఈ పాట చాలా కీ రోల్ ప్లే చేసింది. ఈ పాటకు కీరవాణి కేవలం మ్యూజిక్ ఇవ్వడమే కాకుండా స్వయంగా లిరిక్స్ కూడా రాయడం విశేషం. ఈ క్రేజీ మెలోడీని దీపు, జి. సాహితి తమ వాయిస్‌తో మరింత బ్యూటిఫుల్‌గా మార్చేశారు.
66
రాయే రాయే.. మర్యాద రామన్న రచ్చ
మర్యాద రామన్న సినిమాలోని రాయే రాయే సాంగ్ ఒక పక్కా ఫోక్ ఫ్యూజన్ ట్రాక్. ఈ పాటలోని రిథమ్, ఎనర్జీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎమ్ ఎమ్ కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాటకు చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. రఘు కుంచె, గీతా మాధురి తమదైన మాస్ ఎనర్జీతో పాడిన ఈ పాట అప్పట్లో ఒక పెద్ద చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. అందుకే రాజమౌళి కీరవాణి కాంబో ఎప్పటికీ ఎవర్ గ్రీన్.