‘కేజీఎఫ్’ భామకు వరుస ఆఫర్లు.. మళ్లీ ఆ పొరపాటు చేయదుగా.. శ్రీనిధి చీరకట్టు అందాలు అదుర్స్..

First Published | Oct 22, 2023, 4:33 PM IST

‘కేజీఎఫ్’ హీరోయిన్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ వరుసగా సినిమా అప్డేట్స్ అందిస్తోంది. క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆఫర్స్ దక్కించుకుంటూ వస్తోంది. లేటెస్ట్ రెండు సినిమాలను అనౌన్స్ చేసింది. 
 

కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. తను చదువుకుంటున్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు దక్కించుకుంది. 2016లో మిస్ సుప్రనేషనల్ టైటిల్ ను కూడా సొంతం చేసుకుంది. 
 

మోడలింగ్ లో తనకు వచ్చి న గుర్తింపుతో ఈ ముద్దుగుమ్మకు సినిమా ఆఫర్లు కూడా అందాయి. అయితే శ్రీనిధి అందిన తొలిఆఫరే సెన్సేషనల్ రిజల్ట్ ను అందించడం విశేషం. ప్రశాంత్ నీల్ - యష్ కాంబోలో వచ్చిన ‘కేజీఎఫ్’లో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.


కేజీఎఫ్ ఛాప్టర్ 1 మరియు కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రాలతో అలరించింది. ఛాప్టర్ 2తోనే ఆమె పాత్రకు ముగించినట్టు చూపించారు. మున్ముందు కేజీఎఫ్ ఛాప్టర్ 3 కూడా రానున్న ఈ బ్యూటీ పాత్రకుఅక్కడ ఛాన్స్ లేకుండాపోయింది. ఇక ఇతర ప్రాజెక్ట్స్ పైనా ఫోకస్ పెట్టింది.
 

అయితే, కేజీఎఫ్ ఇచ్చిన సక్సెస్ తో శ్రీనిధి శెట్టి ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. తన క్రేజ్ అమాంతంగా పెరిగింది. ఇదే అవకాశంగా ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనరేషన్ ను పెంచేసింది. తదుపరి ‘కోబ్రా’కు రెట్టింపు స్థాయిలో తీసుకుందని ప్రచారం. 

శ్రీనిధి హీరోయిన్ గా ఇంకా ఆడియెన్స్ లో పూర్తిగా రిజిస్టర్ కాకముందే అలా రెమ్యునరేషన్ పెంచడంతో సినిమా ఆఫర్లు  కూడా తగ్గాయి. ఫలితంగా ఈ ముద్దుగుమ్మకు రెండేళ్ల పాటు ఎలాంటి సినిమా రాలేదు. కాస్తా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడు అవకాశాలు అందుకుంటోంది.
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. తొలుత శ్రీనిధి టాలీవుడ్ లో తన తొలి చిత్రాన్ని ప్రకటించింది. స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తోంది. రాఖీ ఖన్నా మరో హీరోయిన్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టనుంది.

అలాగే కన్నడలోనూ శ్రీనిధికి ఓ భారీ ప్రాజెక్ట్స్ లో నటించే ఛాన్స్ దక్కింది. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కాస్తా బ్రేక్ తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా Kichcha 47 సినిమాను అనౌన్స్ చేశారు. ఇందులో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి ఎంపికైందని అధికారికంగా ప్రకటించారు. తాజాగా అప్డేట్ అందింది. 
 

ఇలా వరుసగా శ్రీనిధి ఆఫర్లు అందుకుంటోంది. కన్నడ, తెలుగులో సినిమాలు చేస్తూ బిజీగా మారనుంది. ఈ ముద్దుగుమ్మ మరిన్ని సినిమాల్లోనూ వచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. అయితే ఈసారైనా శ్రీనిధి రెమ్యునరేషన్ పై కాకుండా కెరీర్ పై ఫోకస్ చేయాలని పలువురు అంటున్నారు. అవకాశాన్ని వినియోగించుకోవాలని అభిప్రాయపడుతున్నారు. 
 

ఇక శ్రీనిధి శెట్టి ఎప్పటి నుంచో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో మెరిసి మంత్రముగ్ధులను చేసింది. బ్యాక్ అందాలను ప్రదర్శిస్తూ మైమరిపించింది. మత్తు ఫోజులతో మతులు పోగొట్టింది. మొత్తానికి బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. 

Latest Videos

click me!