
శ్రీముఖి ప్రస్తుతం తెలుగు బుల్లితెరని శాషిస్తున్న యాంకర్. ఆమె నాలుగైదు షోస్‌కి యాంకర్‌గా రాణిస్తుంది. ఒకప్పుడు తిరుగులేని యాంకర్‌గా రాణించిన సుమ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఆడియెన్స్ ని అలరిస్తూనే ఉంది. బుల్లితెర రాములమ్మగా ఫేమస్ అయ్యింది శ్రీముఖి. డేర్ నెస్, డామినేషన్, ఆ డామినేషన్‌లోనే కామెడీని పండించడం, అందం ఇలా అన్నింటిలోనూ ముందే ఉంటుంది. అందుకే ఈ బ్యూటీ ఎక్కువగా షోస్ దక్కించుకుని దూసుకుపోతుంది.
ఈ షోస్ కోసం ఆమె అందాల విందు ఇస్తుంది. ప్రతి షోస్‌కి ఇలా గ్లామర్ ట్రీట్ ఇస్తే వారం మొత్తం శ్రీముఖి అందాల విందే ఉంటుంది. కానీ గ్యాప్ ఇచ్చి కనువిందు చేస్తుంది. అందాల ఫోటోలతో అలరిస్తుంది. ఇప్పుడు కూడా ఆమె పంచుకునే ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
ఇందులో లేత గోదుమ రంగు డ్రెస్‌లో మెరిసింది. యువరాణిలాంటి డ్రెస్ ధరించి మెస్మరైజ్ చేసింది. రాజహంసలా మతిపోగొడుతుంది. ప్రేమ దేశపు యువరాణిలా ఆకట్టుకుంటుంది. కుర్రాళ్లకి కనుల విందు చేస్తుంది.
ఈ సందర్భంగా శ్రీముఖి అందంపై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. పెళ్లీడుకొచ్చిన యువరాణిలా ఉందంటున్నారు. దివి నుంచిదిగి వచ్చిన అప్సరసలా ఉందంటున్నారు. ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ బ్యూటీ పిక్స్ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.
శ్రీముఖి.. చలాకీతనానికి కేరాఫ్. సిచ్చువేషన్ ఏదైనా సరదాగా ఉంటూ నవ్విస్తుంది. అదే సమయంలో కొంత డామినేషన్ చూపిస్తుంది. బిగ్ స్క్రీన్‌పై విజయశాంతి రాములమ్మ అయితే, బుల్లితెరపై శ్రీముఖి రాములమ్మగా రాణిస్తుంది.
అందాల బొద్దు యాంకర్ శ్రీముఖి.. యాంకర్‌గా మెప్పిస్తూనే సినిమాల్లోనూ ప్రయత్నాలు చేస్తుంది. వచ్చిన అవకాశాన్ని కాదనకుండా చేస్తుంది. మరోవైపు కొన్నిసార్లు పెద్ద తెరపై తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ సక్సెస్ కాలేకపోతుంది.
ఆ మధ్య చిరంజీవితో కలిసి నటించింది. `భోళా శంకర్` చిత్రంలో చిరంజీవితో కలిసి సరసాలు ఆడుతూ అలరించింది. అదే సమయంలో `ఖుషి` నడుము సీన్‌ని చిరుతో కలిసి రిపీట్ చేసింది. థియేటర్లలో రచ్చ రచ్చ చేసింది. కానీ సినిమా పరాజయం చెందడంతో దీనిపై ట్రోల్స్ వచ్చాయి.
శ్రీముఖికి బిగ్ స్క్రీన్ పెద్దగా అచ్చిరాలేదనే చెప్పొచ్చు. అందుకే బుల్లితెరనే నమ్ముకుంది. అక్కడే తన విశ్వరూపం చూపిస్తుంది. స్టార్ స్టేటస్‌ని తెచ్చుకుంటుంది. ప్రస్తుతం శ్రీముఖి.. `స్టార్ మా పరివారం`, `కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్`, `సారంగదరియా` వంటి షోస్‌కి యాంకర్‌గా చేస్తుంది శ్రీముఖి.