ఎనెర్జిటిక్ గా యాంకరింగ్ చేస్తూ, నవ్విస్తూ, అందంతో ఆకట్టుకునే భామ శ్రీముఖి. టాలీవుడ్ లో అందాల యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర షోలతో పాపులర్ అయింది.
ఎనెర్జిటిక్ గా యాంకరింగ్ చేస్తూ, నవ్విస్తూ, అందంతో ఆకట్టుకునే భామ శ్రీముఖి. టాలీవుడ్ లో అందాల యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర షోలతో పాపులర్ అయింది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది.
26
బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.
36
ఇక బిగ్ బాస్ సీజన్ 3లో Sreemukhi, రాహుల్ సిప్లిగంజ్ మధ్యే ప్రధానంగా పోటీ సాగింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు.
46
శ్రీముఖి గత ఏడాది 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే.
56
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి కళ్ళు జిగేల్ మనే అందంతో మెరిసింది. కామెడీ స్టార్స్ షో కోసం ఆమె ధరించిన అవుట్ ఫిట్ చూపు తిప్పుకోలేని విధంగా ఉంది.
66
బ్లూ టాప్ ఉండే అద్భుతమైన డ్రెస్ లో శ్రీముఖి అందాల దేవతలా కనిపిస్తోంది. తలపై పాపిడి బిళ్ళతో శ్రీముఖి ఆకర్షిస్తుంది. తన అందాలతో శ్రీముఖి కుర్రాళ్ల మతిపోగొడుతోంది. అందంలో శ్రీముఖి కోహినూర్ డైమండ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.