యంగ్ యాంకర్ శ్రీముఖి కెరీర్ బాగానే నిర్మించుకుంటుంది. హోస్ట్ గా ఓ ప్రక్క అనేక కార్యక్రమాలలో నటిస్తూనే సొంతగా కొన్ని టాక్ షోలు చేస్తుంది.
శ్రీముఖి తన యూట్యూబ్ ఛానెల్లో ఓ ఉమానియాఅనే టాక్ షో ప్రారంభించారు. ఈ షోకి నిర్మాతగా ఉన్న శ్రీముఖి బాగానే ఖర్చుపెడుతున్నారని సమాచారం. షో ప్రమోషన్ కోసం ప్రత్యేక సాంగ్ శ్రీముఖిచేయడం జరిగింది.
ఓ ఉమానియా టాక్ షోలోమొదటి ఎపిసోడ్ కి స్టార్ యాంకర్సుమనుఆహ్వానించారు. హోస్ట్ గా సుమతో ఆమె ఇంటర్వ్యూకుమంచి స్పందనే వచ్చినట్లు తెలుస్తుంది.
మరో ఎపిసోడ్ లో శ్రీముఖిహీరోయిన్ పూర్ణను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న శ్రీముఖికిసోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా ఎక్కువే.
తాజాగా ఓ షో కోసం స్కై బ్లూ కోట్, టైట్ జీన్స్ ధరించి స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చింది. టైట్ జీన్స్, హై హీల్స్ షూస్ ధరించిన శ్రీముఖి ట్రెండీ లుక్ లో కేకపుట్టించింది.