Sreeleela: టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్లిన శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్‌పై కన్నేసింది. అవకాశాలు తగ్గాయని ఫీలయ్యేలోపే, ఏకంగా జాన్వీ కపూర్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందని టాక్. ఇంతకీ విషయం ఏంటంటే?
ఒకచోట అవకాశాలు తగ్గినప్పుడు, మరోచోట వెతుక్కుంటూ వచ్చే ఛాన్సులను వాడుకోవడమే తెలివైన పని? ఇప్పుడు హీరోయిన్ శ్రీలీల సినిమా ప్రయాణం చూస్తుంటే సరిగ్గా ఇదే అనిపిస్తోంది. చాలా కొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్ మీద గట్టిగా ఫోకస్ పెట్టినట్టుంది. తెలుగులో బ్యాక్-టు-బ్యాక్ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీలీల, ఇప్పుడు నెమ్మదిగా బాలీవుడ్‌లోనూ అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొన్ని హిందీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ భామ, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాకు ఓకే చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
24
జాన్వీ కపూర్ తో శ్రీలీల కాంబినేషన్
శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి జాన్వీ కపూర్ కూడా తోడవుతోంది. ఇప్పటికే హిందీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జాన్వీతో శ్రీలీల కాంబినేషన్ పై అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. సమాచారం ప్రకారం, ఉమేష్ బిస్త్ దర్శకత్వంలో శ్రీలీల, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో ఓ లేడీ ఓరియెంటెడ్ మల్టీస్టారర్ సినిమా రాబోతోందట. ఏక్తా కపూర్, గునీత్ మోంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని, సినిమా కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు.
34
బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరి మధ్య పోటీ
ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ఇష్టపడతారట. ఆ అమ్మాయిల చుట్టూనే కథ తిరుగుతుందని చెబుతున్నారు. ప్రేమ, ఎమోషన్స్, గొడవలు, ట్విస్టులతో కూడిన రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతోందని టాక్. శ్రీలీల, జాన్వీ కపూర్ ఇద్దరికీ వేర్వేరు ఇండస్ట్రీలలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి, వీరిద్దరి కాంబినేషన్ స్క్రీన్‌పై ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఇప్పటి నుంచే మొదలైంది. శ్రీలీల ఇప్పుడు హిందీలో వరుసగా ప్రాజెక్టులు లైన్‌లో పెడుతోంది. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా, సైఫ్ అలీ ఖాన్ కొడుకుతో కూడా ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.
హిందీ సినిమాలతో పాటు శ్రీలీల దృష్టి తమిళ ఇండస్ట్రీపై కూడా పడింది. ధనుష్‌తో ఒక సినిమా, అలాగే అజిత్ సినిమాలో కూడా నటించనుందనే మాటలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, తెలుగులో దుమ్మురేపిన శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ బయట ఇతర ఇండస్ట్రీలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో వరుసగా పెద్ద అవకాశాలు రావడం విశేషం. మరి టాలీవుడ్‌లో సక్సెస్ అయిన శ్రీలీల, బాలీవుడ్‌లోనూ అదే మ్యాజిక్ చేస్తుందా? జాన్వీ కపూర్‌తో కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా ఆమె కెరీర్‌కు మరో పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.