వీటితోపాటు విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి మూవీలో, అలాగే నితిన్‌తో ఓ సినిమా, రామ్ బోయపాటి సినిమా, నవీన్ పొలిశెట్టి `అనగనగా ఓ రాజు`, కన్నడలో ఓ సినిమా చేస్తుంది. ఇలా ఎనిమిది సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయట. ఇలా రోజు రెండు షిఫ్ట్ ల్లో వర్క్ చేస్తూ వాహ్ అనిపిస్తుంది. 1980-90లో అప్పటి కథానాయికలు ఇలా రెండు షిఫ్ట్ ల్లో సినిమాలు చేసేవారు, ఇప్పుడు శ్రీలీల ఆ ఫేజ్‌ని ఎంజాయ్ చేస్తుండటం, అంతటి బిజీగా మారడం విశేషం.