
శ్రీలీలా(Sree Leela) ఏడాది క్రితం వరకు ఎవరికీ తెలియదు. `పెళ్లి సందD` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ క్యూట్ బ్యూటీ. లేలేత అందాలతో తెలుగు ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసింది. `పెళ్లి సందD` చిత్రంలో రోషన్‌కి లవర్‌గా నటించి కట్టిపడేస్తుంది. అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. హీరోని డామినేట్ చేసి హైలైట్‌గా నిలిచింది. దీంతో ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయిన శ్రీలీలా నేడు(జూన్ 14) మంగళవారం పుట్టిన రోజు జరుపుకుంటుంది. Sree Leela Birthday.
ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమా అప్‌డేట్లని ప్రకటించారు. ప్రస్తుతం ఆమె `అనగనగా ఒక రాజు` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రమిది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. దీంతోపాటు పంజా వైష్ణవ్ తేజ్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మరో సినిమా చేస్తుంది. వీటితోపాటు రవితేజ సరసన `ధమాకా` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్‌ని మంగళవారం విడుదల చేశారు.
అలాగే బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలోనూ ఆయనకు కూతురిగా శ్రీలీలా నటిస్తుందని సమాచారం. అలాగే ప్రభాస్‌తో మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో శ్రీలీలా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మరోవైపు కన్నడ నటుడు గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు గాలి కిరిటీరెడ్డి కుమారుడు ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న చిత్రంలోనూ శ్రీలీలా కథానాయికగా నటిస్తుండటం విశేషం. అలాగే నితిన్, వక్కంతం వంశీ చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికైందని టాక్.
కేవలం `పెళ్లి సందD` అనే ఒక్క సినిమా శ్రీలీలా జీవితాన్నే మార్చేసింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడమే ఇంతటి క్రేజ్‌కి కారణమని చెప్పొచ్చు. సినిమా సైతం మంచి కమర్షియల్ విజయాన్ని సాధించింది. ఇందులో ఆమె పాత్ర సైతం అందరికి కనెక్ట్ కావడం, కొత్త హీరోయిన్ కావడంతో హాట్ కేక్‌లా మారిపోయిందని చెప్పొచ్చు.
ఒక్క సినిమాతో ప్రస్తుతం ఆమెకి ఏడు సినిమా ఆఫర్లు రావడం విశేషం. `ఉప్పెన` చిత్రంతో కృతి శెట్టి సైతం వరుస ఆఫర్లు దక్కించుకుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని అందుకుంది. యంగ్ స్టర్స్ అందరితోనూ ఓ రౌండ్ ఆడిపాడుతుంది కృతి శెట్టి. ఇప్పుడు ఆమె మాదిరిగానే శ్రీలీలా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడీ భామ స్టార్ హీరోయిన్లకి చెమటలు పట్టిస్తుంది. టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్న పూజా, రష్మికలకు త్వరలోనే ఝలక్ ఇవ్వబోతుందని అంటున్నారు నెటిజన్లు. ఈ జోరు ఇలానే కొనసాగితే, ఒకటి రెండు హిట్లు పడితే, టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోతుందని అంటున్నారు. పూజా, రష్మిక వంటి హీరోయిన్లకి పోటీనివ్వడం ఖాయమంటున్నారు.
ఒక్క సినిమాతోనే ఈ అమ్మడికి ప్రభాస్, బాలయ్య వంటి హీరోల చిత్రంలో నటించే ఆఫర్ రావడం మామూలు విషయం కాదు. అయితే ఈ అమ్మడికి రాఘవేంద్రరావు కాంపౌండ్ సపోర్ట్ ఉందనే టాక్ కూడా ఉంది. అవకాశాలు ఈ స్థాయిలో రావడం వెనకాల పెద్దల సహకారం కచ్చితంగా ఉండాల్సిందే. ఆ విషయంలో శ్రీలీలా చాలా తెలివిగా మూవ్ అవుతుందని భోగట్టా.
ఇక శ్రీలీలా వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె బెంగుళూరుకి చెందిన తెలుగు ఫ్యామిలీ అమ్మాయి కావడం విశేషం. ఆమె భరతనాట్యం కూడా నేర్చుకుంది. అయితే వాళ్ల అమ్మ డాక్టర్ కావడంతో తనుకూడా డాక్టర్ కావాలనుకుంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చేసింది.
కానీ కాలేజ్ టైమ్‌లోనే శ్రీలీలా మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ద్వారా సినిమా ఆఫర్లు వచ్చాయి. కన్నడలో మూడేళ్ల క్రితం `కిస్` సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత `భరాటే` చిత్రంలో నటించింది. గతేడాది `పెళ్లి సందD`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె కన్నడలో `బై టూ లవ్` అనే సినిమాలోనూ మెరిసింది. ఇప్పుడు పూర్తిగా తెలుగు హీరోయిన్ అయిపోయింది.