ఉపాసన పోస్ట్ కి సెలెబ్రటీలు స్పందిస్తున్నారు. 'మీ ఇద్దరికీ హ్యాపీ యానవర్సరీ. మీ జీవితంలో సంతోషం, చిరునవ్వులు ఎప్పటికి ఉండాలి' అంటూ కాజల్ అగర్వాల్ కామెంట్ పెట్టింది. నా ఫేవరిట్ పర్సన్స్ ఇద్దరికి హ్యాపీ వెడ్డింగ్ యనవర్సరీ అంటూ సమంత కామెంట్ పెట్టింది. అలాగే సానియా మీర్జా కూడా చరణ్, ఉపాసనకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది.