నిఖిల్ హీరోగా నటించిన `స్పై` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది ఐశ్వర్య మీనన్ (Aiswarya Menon). ఇందులో ఆమె నటన, యాక్షన్, గ్లామర్ ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేశాయి. సినిమా పరాజయం చెందినా, ఆమెకి మాత్రం మంచి పేరొచ్చింది. తెలుగు ఆడియెన్స్ కి గుర్తిండిపోయింది.
అయితే సోషల్ మీడియా ద్వారా మరింతగా టచ్‌లో ఉంటుంది ఐశ్వర్య మీనన్. ఆమె తన గ్లామర్‌కి గేట్లు ఎత్తేసి అందాల విందు చేస్తుంది. తన హాట్ అందాలను బోల్డ్ గా ఆవిష్కరిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆమె చేసిన పని అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
ఐశ్వర్య మీనన్‌కి ఒక పెంపుడు కుక్క ఉంది. దాని పేరు `కాఫీ మీనన్`. అదంటే తనకు ఎంతో ప్రేమ. ఆ ప్రేమని చాటుకుంది. ఎవరూ చేయని విధంగా ఏకంగా బర్త్ డే ని సెలబ్రేట్ చేసింది. అయితే అది మామూలు సెలబ్రేషన్ కాదు. ప్రత్యేకంగా డెకరేట్ చేయించి, ప్రాపర్ పార్టీని అరెంజ్ చేసింది. కేక్ కట్ చేయించింది.
దీనికితోడు తన ఫ్రెండ్స్ ని పిలిపించుకుని మరీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. తన పెట్ డాగ్ బర్త్ డేలో ఫ్రెండ్స్ ని ఇన్‌వాల్వ్ చేయించి దానిపై ఎంతటి ప్రేమ ఉందో చాటి చెప్పింది. మరోవైపు ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది.
`మీరు కుక్కని ప్రేమించకపోతే, మీ గుండెలో కొంత భాగం ఎప్పుడూ తెరవదు(హార్ట్ పూర్తి కాదు). ప్రతి డాగ్ యాజమాని దీనికి అవును అనే చెబుతారు` అని పోస్ట్ పెట్టింది. అయితే తన డాగ్‌కి `కాఫీ మీనన్` అనే పేరు కూడా పెట్టింది. తన డాగ్‌పై ఇంతటి ప్రేమని చూపించడం, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఆశ్చర్యపరుస్తుంది.
తన డాగ్ బర్త్ డే సందర్భంగా తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది ఐశ్వర్య మీనన్. వారంతా వచ్చి కాఫీ మీనన్ బర్త్ డే చాలా స్పెషల్‌గా మార్చారని తెలిపింది. ఈ సందర్బంగా దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.
ఐశ్వర్య మీనన్ తమిళం, కన్నడలో సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. ఈ క్రమంలో ఆమె `స్పై` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నిఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ అందాల విందుతో, యాక్షన్‌తో అదరగొట్టింది. ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ఇప్పుడు మలయాళంలో ఓ సినిమా చేస్తుందీ సెక్సీ బ్యూటీ.