మహేశ్ బాబు స్టైలిష్ లుక్... హాలీవుడ్ రేంజ్.. నమ్రతా హాట్ కామెంట్..

First Published | Oct 17, 2023, 11:08 AM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు నయా లుక్ నెట్టింట వైరల్ గా మారింది. టూ యంగ్ గా, స్టైలిష్ గా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ ఫొటోలను వైరల్ గా మారుస్తున్నారు.

వయస్సు పెరుగుతున్నా కొద్దీ మరీ యంగ్ గా మారిపోతున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu).  ఇటీవల వరుసగా నయా లుక్స్ తో దర్శనమిస్తూ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నారు. 
 

తాజాగా ‘హలో’ మేగజైన్ కోసం ఫొటోషూట్ చేశారు.  లేటెస్ట్ ఫ్యాషన్ లో కనిపించారు. స్టైలిష్ లుక్ తో అదరగొట్టారు. బ్లాక్ అండ్ బ్లాక్,  హుడీ, పింక్ సూట్ లో దర్శనమిచ్చారు. 


ఆ ఫొటోలను తాజాగా మహేశ్ బాబు ఇన్ స్టా వేదికన అభిమానులతో పంచుకున్నారు. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. 
 

లేటెస్ట్ ఫొటోషూట్ పై నమ్రతా శిరోద్కర్ కూడా స్పందించారు. హాలో హాటీ... అంటూ  ఆఫొటోలపై కామెంట్ చేశారు. పలువురు సెలబ్రెటీలు, అభిమానులు, నెటిజన్లు మహేశ్ బాబు నయా లుక్ కు ఫిదా అవుతున్నారు. 

48 ఏళ్ల వయస్సులోనూ మహేశ్ బాబు మరీ యంగ్ గా కనిపిస్తుండటం విశేషం. ఇందుకోసం బాబు ఫిట్ నెస్ విషయంలో, ఫుడ్ తీసుకోవడంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో తెలిసిందే. 
 

ఇక ప్రస్తుతం మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గానే రాజమౌళి కూడా బాబు కలిశారు. దీంతో SSMB29 పైనా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!