Wishes To Ram Charan : చెర్రీకి ఆర్సీ15, ఆర్ఆర్ఆర్ టీం, అల్లు అర్జున్, సెలబ్స్ నుంచి స్పెషల్ బర్త్ డే విషెస్.

Published : Mar 27, 2022, 12:07 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డేను ఇటు ఫ్యాన్స్, అటు ఫ్యామిలీ మెంబర్స గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ టీం, ఆర్సీ 15 టీం స్పెషల్ విషెస్ తెలియజేశారు. అలాగే అల్లు అర్జున్, కాజల్, తమన్నా కూడా శుభాకాాంక్షలు తెలిపారు.   

PREV
16
Wishes To Ram Charan : చెర్రీకి ఆర్సీ15, ఆర్ఆర్ఆర్ టీం,  అల్లు అర్జున్, సెలబ్స్ నుంచి స్పెషల్ బర్త్ డే విషెస్.

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ పుట్టిన  రోజు వేడుకలు చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇటు మెగా ఫ్యామిలీ నుంచి, అటు డైహార్ట్ ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తుకున్న శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వేడుకలను కూడా నిన్నటి నుంచే షూరు చేశారు. ఇందుకు రామ్ చరణ్ ఎంతో సంతోషించారు. తనను అభిమానిస్తున్న వారందరికీ హ్రుదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.
 

26

మరోవైపు సినీ ప్రముఖులు కూడా హార్ట్లీ విషెస్ తెలుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ RRR మూవీతో రామ్ చరణ్ తారా స్థాయికి చేరుకున్నాడు. అల్లూరి సీతారామరాజు పాత్రలో చక్కగా ఒదిగిపోవడంతో ఫ్యాన్స్ కు తనపై రెండింతల అభిమానం పెరిగింది. దీనికి తోడు ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన రెండు రోజులకే  చెర్రీ బర్త్ డే రావడంతో పెద్ద ఎత్తున్న సెలబ్రేట్ చేస్తున్నారు. 
 

36

ఇక నిహారిక కూడా తన అన్నయ్య రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ తెలియజేసింది. త్రో బ్యాక్ పిక్ఛర్ ను పంచుకుంటూ.. ‘నా బలం, నా స్వీట్ బ్రదర్ కు  పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ జీవితంలో చాలా మంచి జరగాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేసింది. అలాగే రానా దగ్గుబాటి కూడా సోషల్ మీడియాలో రామ్ చరణ్, రానా కలిసి ఉన్న త్రో బ్యాక్ పిక్ఛర్ ను పంచుకుంటూ బర్త్ డే విషెస్ తెలిపారు. 
 

46

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ట్విట్టర్ లో రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘నా సోదరుడు రామ్ చరణ్ ఇలాంటి పుట్టిన రోజులు చాలా జరుపుకోవాలి. ఈ కొత్త సంవత్సరం చరణ్ జీవితంలో మరింత సంతోషాన్నిమరియు విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. నేను ఈ రోజు నిన్నుచూడాలని కోరుకుంటున్నాను’ అంటూ పేర్కొన్నాడు. ఇక హీరో సాయి ధరమ్ తేజ్ వారి చిన్పప్పటి ఫొటోను షేర్ చేశాడు. ‘ఆ దేవుడు నీకు మంచి ఆరోగ్యం, ఆనందం, ప్రేమను ఇవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ మేజర్ త్రోబ్యాక్ పిక్ ను పంచుకుంటూ బర్త్ డే విషేస్ తెలిపాడు.  
 

56

ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ టీం నుంచి రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చేస్తున్న ఫొటోను  ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘మా సీతా రామారాజు రామ్ చరణ్ తేజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ విష్ చేశారు. అలాగే ఆర్సీ 15 నుంచి ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ మెగా పవర్ స్టార్ కు బర్త్ డే విషెస్ తెలియజేశారు. 
 

66

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), తమన్నా భాటియా (Tamannaah Bhatia) కూడా చెర్రీ స్వీట్ బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా చెర్రీ బర్త్ డే స్పెషల్ సాంగ్ థమ్ నెయిల్స్ ను అభిమానులతో పంచుకున్నారు. అలాగే బుల్లితెర బ్యూటీ అనసూయ కూడా చరణ్ కు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే డైరెక్టర్ శ్రీను వైట్ల కూడా త్రో బ్యాక్ పిక్చర్ ను పంచుకున్నాడు. 
 

click me!

Recommended Stories