భారతీయ సినిమాలో అత్యంత బిజీ నటుడు ధనుష్. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా అరడజను సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం రాయన్, కుబేర అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ధనుష్ ప్రధాన పాత్రలో రాయన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయనకు 50వ సినిమా. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.