సినిమా కథ: ఒక సాధారణ క్రికెటర్ నుండి భారత క్రికెట్ జట్టుకు అత్యంత గొప్ప, పవర్‌ఫుల్ కెప్టెన్‌గా గంగూలీ ఎదిగిన ప్రస్థానం, అతని పట్టుదల, సంకల్పం, భారత క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన పోరాట క్షణాల కథను ఈ చిత్రం చెబుతుంది. ఈ సినిమాకు విక్రమ్ ఆదిత్య మోత్వానే దర్శకత్వం వహిస్తుండగా, లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మిస్తున్నారు. టి-సిరీస్, లవ్ ఫిల్మ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్, సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'దాదా' సినిమా మే 14, 2027న థియేటర్లలో విడుదల కానుంది. భారత క్రికెట్‌లో కొత్త శకాన్ని సృష్టించిన దాదా కథను తెరపై చూడటానికి అభిమానులు వెయిట్ చేస్తున్నారు.