Sobhan Babu: కారులోనే కన్నీళ్లు పెట్టుకున్న శోభన్ బాబు, మొదటి 2 వారాలు థియేటర్లు ఖాళీ.. కట్ చేస్తే

Published : Jul 17, 2026, 07:00 AM IST

శోభన్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ఓ చిత్రానికి మొదటి రెండు వారాలు అస్సలు కలెక్షన్స్ రాలేదు. భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్లాప్ అని అనుకున్నారు. శోభన్ బాబు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.

PREV
15
Sobhan Babu

శోభన్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రాలలో పౌరాణిక చిత్రాల పాత్ర ఎక్కువగా ఉంది. వీరాభిమన్యు చిత్రం శోభన్ బాబుకి గుర్తింపు తీసుకువచ్చింది. అప్పటి వరకు శోభన్ బాబుకి అంతగా విజయాలు లేవు. వీరాభిమన్యు చిత్రంలో శోభన్ బాబు పోషించిన అభిమన్యుడి పాత్రకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత శోభన్ బాబుని తిరుగులేని హీరోగా నిలబెట్టిన మరో పౌరాణిక చిత్రం సంపూర్ణ రామాయణం.

25
సంపూర్ణ రామాయణం

ముళ్ళపూడి వెంకటరమణ, ఆరుద్ర రచించిన ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. రామాయణం మూవీ కావడంతో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. భారీ బడ్జెట్ లో సినిమా నిర్మించారు. శోభన్ బాబు తొలిసారి శ్రీరాముడిగా నటించడంతో ప్రాణం పెట్టేశారు. చంద్రకళ ఈ చిత్రంలో సీతగా, ఎస్వీఆర్ రావణుడిగా నటించారు.

35
సినిమాపై ఎన్టీఆర్ ఎఫెక్ట్

సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. శోభన్ బాబు నుంచి దర్శకుడు, నిర్మాతలు, ఇతర నటీనటులు, చిత్ర బృందం మొత్తం ఈ మూవీ సంచలన విజయం గ్యారెంటీ అని భావించారు. కానీ ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక చిత్ర యూనిట్ ఆశలు ఫలించలేదు. అప్పటి వరకు ఎన్టీఆర్ ని రాముడిగా చూస్తూ వచ్చారు. ఒక్కసారిగా శోభన్ బాబుని రాముడిగా చూడడంతో జనాలకు అంతగా ఈ చిత్రం ఎక్కలేదు.

45
మొదటి 2 వారాలు థియేటర్లు ఖాళీ

కానీ శోభన్ బాబు లుక్స్, రాముడిగా కనిపించాల్సిన ప్రసన్నవదనం, నటన ఎందులోనూ ఎలాంటి లోపం లేదు. అయినప్పటికీ ప్రేక్షకులకు వెంటనే ఈ చిత్రం ఎక్కలేదు. దీనితో మొదటి రెండు వారాలు థియేటర్స్ లో జనాలు అస్సలు లేరు. పూర్తిగా నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన కానగల జయకుమార్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు.

55
కన్నీళ్లు పెట్టుకున్న శోభన్ బాబు

సంపూర్ణ రామాయణం చిత్రం 2 వ వారం లోకి ఎంటర్ అయింది. చెన్నైలో నేను పాండి బజార్ వైపు నడుచుకుంటూ వెళుతున్నా. శోభన్ బాబు గారు నన్ను చూసి కారు ఆపారు. ఎక్కడికి వెళుతున్నావ్ అని అన్నారు. పాండి బజార్ కి అని చెప్పా. నేను డ్రాప్ చేస్తా ఎక్కు అని అన్నారు. ఆయన కారు డ్రైవ్ చేస్తూ సంపూర్ణ రామాయణం మూవీ గురించి అడిగారు. అప్పటికే ఆయన చాలా డల్ గా ఉన్నారు. ఏంటి బ్రదర్ మన సినిమా ఇలా అయింది. ఎంతో కష్టపడి చేశాం కదా. కానీ కలెక్షన్స్ సరిగ్గా లేవని అంటున్నారు అని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. అవును సార్ కలెక్షన్స్ సరిగ్గా లేవు. 3 వ వారం నుంచి ఏమైనా పుంజుకుంటుందేమో చూడాలి అని అన్నాను. కానీ ఆయనకి నమ్మకం లేదు. పాండి బజార్ వచ్చాక నేను కారు దిగి వెళ్ళిపోయాను. మూడవ వారంలోకి ఎంటర్ అయ్యాక కలెక్షన్స్ మొదలయ్యాయి అండీ.. థియేటర్ల దగ్గర జాతరే. మహిళలైతే ఎగబడ్డారు. కనీస వసూళ్లు కూడా రావనుకున్న సినిమా కాస్తా శోభన్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయింది అని జయకుమార్ గుర్తు చేసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories