నటుడిగా మారిన ఎస్.జె.సూర్య, 'న్యూ' చిత్రానికి దర్శకత్వం వహించి, నిర్మించి, నటించారు. హీరోగా నటించిన చిత్రాలు విజయవంతం కాకపోవడంతో, ప్రత్యేక పాత్రల్లో నటించారు.
తెలుగులో `ఖుషి` చిత్రానికి దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించారు. సూర్య గెస్ట్ రోల్ చేశారు. ఈ సినిమా విజయంతో దర్శకుడిగా మూవీస్ చేశారు, కానీ ఆ తర్వాత నటనపైనే ఫోకస్ పెట్టారు.
'ఇరైవి' చిత్రంలో ఆయన నటన చాలా మంది మెచ్చుకున్నారు. 'స్పైడర్', 'మెర్సల్' చిత్రాల్లో విలన్‌గా నటించారు. ప్రస్తుతం హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తున్నారు. 'రాయన్', 'గేమ్ ఛేంజర్' వంటి చిత్రాల్లో విలన్‌గా నటించారు.