శివాజీ గణేశన్ సినిమాను కేవలం వ్యాపారంగా చూడలేదు. కళ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ ప్రత్యేకం. అందుకే ఆయనతో ఇంకెవరినీ పోల్చలేం. అలాంటి గొప్ప నటుడు ఒక సినిమాలో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించారు. ఆ సినిమా పేరే 'కావల్ దైవం'. ఇది 1969లో విడుదలైంది.
25
ఏవీఎం శరవణన్ సాయం కోరిన సుబ్బయ్య
ప్రముఖ రచయిత జయకాంతన్ రాసిన 'కై విలంగు' నవల ఆధారంగా 'కావల్ దైవం' సినిమాను తెరకెక్కించారు. నటుడు, నిర్మాత ఎస్.వి. సుబ్బయ్య ఈ సినిమాను నిర్మించారు. ఇందులో శివాజీ గణేశన్ గెస్ట్ రోల్ చేశారు. ఆయనకు జోడీగా మనోరమ నటించారు. అయితే శివాజీని అడగడానికి సుబ్బయ్య మొహమాటపడ్డారు. దీంతో ఏవీఎం శరవణన్ ద్వారా శివాజీని సంప్రదించారు. "ఈ సినిమాను పూర్తిగా సుబ్బయ్యే నిర్మిస్తున్నారా?" అని శివాజీ అడిగారు. అవునని చెప్పగానే వెంటనే నటించడానికి ఒప్పుకున్నారు.
35
స్నేహితుడి కోసం ఫ్రీగా నటిస్తానన్న శివాజీ
ఎస్.వి. సుబ్బయ్య తనకు కేవలం స్నేహితుడు మాత్రమే కాదు, తోటి నటుడు కూడా. అందుకే ఆయన సొంతంగా నిర్మిస్తున్న సినిమాలో నటించినందుకు డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదని శివాజీ భావించారు. "ఆయన తీసే సినిమాలో నేను నటిస్తాను. కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోను" అని శివాజీ తేల్చి చెప్పారు. చెప్పినట్లుగానే షూటింగ్‌లో పాల్గొని తన పాత్రను పూర్తి చేశారు.
శివాజీకి ఎలాగైనా డబ్బులు ఇవ్వాలని ఎస్.వి. సుబ్బయ్య అనుకున్నారు. డైరెక్ట్‌గా ఇస్తే తీసుకోరని ఆయనకు తెలుసు. అందుకే ఒక కొత్త ప్లాన్ వేశారు. ఒక టిఫిన్ క్యారియర్ తీసుకుని, పై డబ్బాల్లో భోజనం పెట్టారు. అడుగున ఉన్న డబ్బాలో రూ.15,000 నగదు పెట్టారు. "ఇందులో భోజనం ఉంది, మీరు కచ్చితంగా తినాలి" అని చెప్పి ఆ క్యారియర్‌ను శివాజీకి ఇచ్చారు. శివాజీ దాన్ని తెరిచి చూడగానే అడుగున డబ్బులు కనిపించాయి.
55
డబ్బులు వెనక్కి ఇచ్చేసిన శివాజీ
ఆ డబ్బులు చూడగానే శివాజీ గణేశన్‌కు కోపం వచ్చింది. వెంటనే ఎస్.వి. సుబ్బయ్యకు ఫోన్ చేశారు. తాను ముందే డబ్బులు వద్దని చెప్పినా, ఇలా ఎందుకు ఇచ్చారని నిలదీశారు. తన నిర్ణయానికే కట్టుబడి, ఆ రూ.15,000 డబ్బును సుబ్బయ్యకే తిరిగి ఇచ్చేశారు. స్టార్ హీరోగా ఉన్న టైమ్‌లో కూడా స్నేహితుడి కోసం ఫ్రీగా నటించడం శివాజీ గొప్పతనానికి నిదర్శనం.